E-Paper
Advertisement

Telangana News: లత్తుకోరు మాటలొద్దు.. కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్, ఇదిగో ఆధారాలు

Telangana News: లత్తుకోరు మాటలొద్దు.. కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్, ఇదిగో ఆధారాలు
Advertisement

Telangana News: తెలంగాణలో యూరియా వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీ-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గడిచిన ఆరునెలలుగా ఈ వ్యవహారంలో రకరకాలుగా అబద్దాలు చెబుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Advertisement

కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్

Advertisement

తెలంగాణలో యూరియా తక్కువగా ఉందంటూ కొన్నాళ్లుగా ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి మాజీ మంత్రి పదే పదే ఇలాంటి మాటలు చెప్పడంతో కాంగ్రెస్ మండిపడింది. దీనిపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి లత్తుకోరు మాటలు వద్దని, నిజాలు చెప్పాలన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎంపీలు యూరియా అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాయి. దీనిపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. కావాలనే ఈ విధంగా బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఆరోపించారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు.

యూరియా వ్యవహారంలో లత్తుకోరు మాటలొద్దన్న ఎంపీ చామల

తప్పుడు సమాచారంతో కేటీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని సూచన చేశారు. 2024-25 ఏడాదిలో వానాకాలం పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు తెప్పించామన్నారు. యాసంగి సీజన్‌కు మరో 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు.  పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ స్థాయిలో యూరియా  తెలంగాణకు ఏనాడూ తీసుకురాలేదని లెక్కలతో సహా వివరించారు సదరు ఎంపీ.

2025-26 వానాకాలం పంటకు ఇప్పటికే 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. కేంద్రం నుంచి యూరియా తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా విఫలం కాలేదన్నారు. వాస్తవాలు తెలుసుకుని కేటీఆర్ మాట్లాడాలని కౌంటరిచ్చారు.  యూరియా కోసం ధర్నాలు చేశామని, కేంద్రమంత్రి నడ్డాతో మాట్లాడి తెప్పించామన్నారు.

ALSO READ:  తెలంగాణలో ఫ్యూచర్ సిటీ టార్గెట్ ఫిక్సయ్యింది, కేవలం 30 నెలలు మాత్రమే

యూరియా విషయంలో కేటీఆర్, హరీష్‌రావు పదే పదే ఆరోపణలు చేయడాన్ని ఎంపీ చామల తప్పుబట్టారు. దీనికితోడు కృష్ణా, గోదావరి జలాల అంశం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలోనూ  తప్పుడు సమాచారం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ. న్యూఇయర్ రోజున కేటీఆర్, హరీష్‌రావు గోబెల్స్ ప్రచారాన్ని చేయడాన్ని విమర్శించారు ఎంపీ చామల.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×