E-Paper
Advertisement

Naa Anveshana: మరో వీడియోతో రెచ్చిపోయిన అన్వేష్.. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ ను లాగుతూ!

Naa Anveshana: మరో వీడియోతో రెచ్చిపోయిన అన్వేష్.. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ ను లాగుతూ!
Advertisement

Naa Anveshana:నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు వంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకొని దేశ విదేశాలలో సంచరిస్తూ లక్షల్లో ఫాలోవర్స్ ను కలిగిన అన్వేష్ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్త్రీల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. అంతటితో ఆగకుండా గరికపాటి వంటి ప్రవచనకర్త పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఏకంగా హిందూ దేవీదేవత మూర్తులైన సీత, ద్రౌపది వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. పైగా ఇండియాను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఇతడి పై కేసు కూడా ఫైల్ నమోదయింది. ఇక వెంటనే ఇతడిని ఇండియాకు రప్పించి అరెస్టు చేయాలి అని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ప్రముఖ నటి కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కేసు ఫైల్ చేయించింది.

మరో వీడియోతో రెచ్చిపోయిన అన్వేష్..

దీనికి తోడు నెటిజన్లు కూడా ఇతడికి భారీ షాక్ ఇచ్చారు సుమారుగా 20 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు అన్ ఫాలో కొట్టి.. గట్టి షాక్ తగిలేలా చేశారు. అయినా సరే ఇతడు మాత్రం తగ్గడం లేదు..ఈసారి మరో వీడియోతో ఏకంగా ఆంధ్రప్రదేశ్ డీసీఎం , నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలోకి లాగుతూ చేసిన వీడియో సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా కొన్ని వీడియోలు పంచుకున్నారు అన్వేష్. అందులో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలోని కోర్టు సీను షేర్ చేశాడు.

Advertisement

ALSO READ:Film industry: సినిమాల్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్న ఫైర్ బ్రాండ్.. ఈసారి రెట్టింపు వేగంతో!

ఏకంగా పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి లాగుతూ..

ఇందులో మహిళల బట్టలపై పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు. మహిళలకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉంది అని అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఈ సన్నివేశంలో ఉంటాయి. మహిళలకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉందని పవన్ కళ్యాణే చెబుతున్నాడు. నేను చెబితే తప్పేంటన్నా అనే రేంజ్ లో ఆ వీడియోని షేర్ చేశాడు అన్వేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.

అన్వేష్ పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు..

Advertisement

ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నువ్వు చేసిన పనికిమాలిన పనికి మా హీరోని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావ్ అంటూ అన్వేష్ కి కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు ఇతను దేశద్రోహి.. వెంటనే ఇతడిపై కేసు ఫైల్ చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే అన్వేష్ రోజుకు ఒక వీడియోతో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×