E-Paper
Advertisement

తెలంగాణపై ద్వేషం వద్దు.. నిధులు కావాలి.. ప్రధానికి పీసీసీ ప్రెసిడెంట్ లేఖ

తెలంగాణపై ద్వేషం వద్దు.. నిధులు కావాలి.. ప్రధానికి  పీసీసీ ప్రెసిడెంట్ లేఖ
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పది కీలక అంశాలను లేఖలో ప్రస్తావించిన ఆయన.. వీటికి తక్షణమే అనుమతులు.. నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన 122.9 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును జాయింట్ వెంచర్ నమూనాలో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్ధరణ ప్రాజెక్టుగా గుర్తించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ తక్షణమే ఆర్థిక అనుమతులు ఇవ్వాలని.. దక్షిణ భాగానికి కూడా ఆలస్యం లేకుండా ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటుగా రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును కేంద్రం పూర్తి నిధులతో చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని ప్రధానిని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డును రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానించే రేడియల్ రోడ్ల అభివృద్ధికి రూ. 45,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ సిగ్నల్-ఫ్రీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద హైదరాబాద్ ఫ్యాబ్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చి.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను క్లియర్ చేయాలని పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) వచ్చేలా చూడాలని కోరారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని.. కాజీపేట రైల్వే యూనిట్‌ను పూర్తిస్థాయి కోచ్ ఫ్యాక్టరీగా మార్చాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు నవోదయ.. కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతలు ద్వేషాన్ని వీడాలని.. రాష్ట్ర అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ కేంద్ర నిధులు.. ప్రాజెక్టులు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ తన లేఖలో స్పష్టం చేశారు

Advertisement

Read Also: తెలంగాణ హక్కులపై గళమెత్తిన ఎంపీ చామల.. ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు

Related News

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×