E-Paper
Advertisement

Jagga Reddy Humanity: జగ్గారెడ్డి మరోసారి మానవత్వం.. ఆ వ్యక్తికి రూ.50 వేలు సాయం

Jagga Reddy Humanity: జగ్గారెడ్డి మరోసారి మానవత్వం..  ఆ వ్యక్తికి రూ.50 వేలు సాయం
Advertisement

Jagga Reddy Humanity: తెలంగాణ రాజకీయ నేతల్లో ఆయన శైలి వేరు. ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పాల్సిన నాలుగు మాటలు, చేయాల్సిన సాయం చేస్తుంటారు. ఆయన ఎవరో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆయన మరోసారి మానవత్వం చాటుకున్నారు.

మరోసారి మానవత్వం చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Advertisement

రాజకీయ నాయకులంటే కార్లలో తిరిగేవారిని ఒకప్పుడు పేరు ఉండేది. తెలంగాణ రాజకీయ నేతల్లో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి శైలి వేరు. పదవిలో ఉన్నా, లేకున్నా ఒకేలా ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతారు. అందుకే నియోజకవర్గంలో ఎవరికి సమస్య వచ్చినా నేరుగా ఆయన ఇంటిని తడతారు ప్రజలు. నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉంటారు కూడా.

మరోసారి మానవత్వం చాటుకున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ వ్యక్తి. పేద కార్మికుడి ఆర్థిక పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. ఆ పేదోడి ఆర్థిక స్థితి గురించి తెలుసుకున్నారు.

Advertisement

పేద కార్మికుడికి తన వంతు ఆర్థిక సాయం

ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తక్షణమే రూ.50 వేలను నగదు ఆర్థికసాయంగా అందజేశారు. కష్టాల్లో ఇన్నవారిని ఆదుకోవడంలో తాను ముందు ఉంటానని మరోసారి నిరూపించారు. మూడురోజుల కిందట సదాశివపేట పట్టణంలో పర్యటించారు జగ్గారెడ్డి. కారు దిగి నేరుగా నిమ్మ సోడా బండి దగ్గరకు వెళ్లి ఆగారు. నిమ్మ సోడా తాగుతూ ఆ బండి నడుపుతున్న మహిళతో ముచ్చటించారు.

తన వ్యాపారంలో సమస్యల గురించి సదరు మహిళ.. జగ్గారెడ్డికి వివరించింది. తన జేబులోంచి లక్ష రూపాయలు తీసి సదరు మహిళకు అందజేశారు. ఈ డబ్బులతో ఎండాకాలం వచ్చేలోపు సోడాల మిషన్ కొనుగోలు చేసి మంచిగా వ్యాపారం చేసుకోవాలని ఆమెకి సూచన చేశారు. ఆ సమయంలో జగ్గారెడ్డి చేసిన సాయానికి ఆ మహిళ ఒక్కసారిగా షాకైంది. మంచిగా వ్యాపారం చేసుకోవాలంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు జగ్గారెడ్డి.

ALSO READ: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×