E-Paper
Advertisement

Tummala latest comments: కచ్చితంగా పోటీ చేస్తా.. కేసీఆర్‌కు తుమ్మల సవాల్!.. ఏ పార్టీ అంటే?

Tummala latest comments: కచ్చితంగా పోటీ చేస్తా.. కేసీఆర్‌కు తుమ్మల సవాల్!.. ఏ పార్టీ అంటే?
Advertisement
Tummala Nageswara rao vs KCR

Tummala Nageswara rao vs KCR(Latest political news telangana):

కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. తుమ్మల మాత్రం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ప్రజల కోసమే తన జీవితం కానీ, రాజకీయాల కోసం కాదన్నారు. తల నరుక్కుంటా కానీ, ఎవరికీ తల వంచనని తేల్చి చెప్పేశారు. కొందరు తనను తప్పించాలని చూశారని.. కానీ, ఆత్మగౌరవం కోసమైనా తాను పోటీ చేస్తానని చెప్పారు మాజీ మంత్రి తుమ్మల. భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వచ్చిన ఆయన.. తన అనుచరులతో సమావేశంలో ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

తుమ్మల టార్గెట్ ఏంటి? ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? ఆయన పోటీ ఏ పార్టీ నుంచి? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. పాలేరు నుంచి పోటీ చేయాలని భావించారాయన. కానీ, బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌కే కేటాయించారు కేసీఆర్. తుమ్మల బాగా హర్ట్ అయ్యారు. తాజాగా వెయ్యి కార్లు, 2వేల బైకులతో ర్యాలీగా వచ్చి బలప్రదర్శన చేశారు. కేడర్‌తో మీటింగ్ పెట్టి.. కేసీఆర్‌కు పరోక్షంగా షాక్ ఇచ్చారు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పడం జిల్లా రాజకీయాలను మార్చేసే డైలాగ్. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి.. ఇక ఆయన కారు గుర్తుపై పోటీ చేసే ఛాన్స్ లేదు. మరి, కారు దిగేస్తారా? తన రాజకీయ భవిష్యత్తు మరో పార్టీలో కొనసాగిస్తారా? ప్రచారం జరుగుతున్నట్టు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నుంచి బరిలో దిగుతారా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

అదే జరిగితే.. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మామూలుగా ఉండదు రాజకీయం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో స్ట్రాంగ్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు సైతం హస్తం కండువా కప్పేసుకుంటే.. ఇక ఖమ్మంలో తిరుగుండదు. 10కి 10. గంపగుత్తగా చేతికి చిక్కినట్టే. కేసీఆర్‌కు ఇక దబిడి దిబిడే..అంటున్నారు.

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×