BigTV English

Padi Kaushik Reddy: బ్రేకింగ్ న్యూస్… పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన బండ్రు శోభారాణి

Padi Kaushik Reddy: బ్రేకింగ్ న్యూస్… పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన బండ్రు శోభారాణి

Bandru Shobharani Comments on BRS MLA Padi Kaushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డిపై ఫైరయ్యారు. బండ్రో శోభారాణి మాట్లాడుతూ..


Also Read: కేసీఆర్ కు అంత సీన్ లేదు.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

‘తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలను అడ్డు పెట్టుకుని పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసీఆర్ కు పంపాలి. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టునికి మాట్లాడు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి.. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.


పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని ఆయనను విచారణకు పిలవాలి. ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగొడతామని మీరు అన్నారు.. కానీ, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలబెడుతామంటూ వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు’ అంటూ శోభారాణి మండిపడ్డారు.

Also Read: ఉప ఎన్నికలకు సిద్ధమా? : కౌశిక్ రెడ్డి

చెప్పుదెబ్బల పాలవుతావ్…

అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ.. ‘పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర నీది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతాం అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచావు. పాడి కౌశిక్ రెడ్డి.. పతివ్రత.. శిరోమణి లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బల పాలవుతావు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే నిన్ను బయట తిరగనివ్వం’ అంటూ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం అధికార ప్రతినిధి భవానీరెడ్డి కూడా కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతుండు. వెంటనే కౌశిక్ రెడ్డి మహిళలకు క్షమాపణలు చెప్పాలి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలి. కౌశిక్ రెడ్డి బుడర్ ఖాన్ లాగా మాట్లాడుతున్నాడు. భవిషత్తులో ఆయన బతుకు ఏమైతదో ఆయనకే తెల్వదు. ఎందుకంటే.. కేసీఆర్ అధికారానికి అడ్డొచ్చిన వాళ్ళను ఆగం చేసిండు. కాంగ్రేస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ. దానికి నిదర్శనమే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి’ అంటూ భవానీరెడ్డి పేర్కొన్నారు.

Also Read: ఇప్పటివరకు హైడ్రా ఎన్ని బిల్డింగ్లను కూల్చివేసిందో తెలుసా..?

ఆ తరువాత పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. ‘కౌశిక్ రెడ్డి… చీరలు, గాజులు మాకు కాదు.. కేసీఆర్, కేటీఆర్ కు పంపు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది వాళ్లే. పాడి కౌశిక్ రెడ్డి కాదు.. పాడే కౌశిక్ రెడ్డి అని పేరు మార్చుకో. వంట చేసిన చేతులు అనుకుంటున్నావు.. కానీ, పాడే కూడా కడుతాం’ అంటూ సంధ్యారెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×