BigTV English

SS Rajamouli: SSRMB అప్డేట్.. రాజమౌళి ఇలాంటి పని చేస్తాడనుకోలేదు

SS Rajamouli: SSRMB అప్డేట్.. రాజమౌళి ఇలాంటి పని చేస్తాడనుకోలేదు

SS Rajamouli: ఇండస్ట్రీలో ఎన్ని కాంబోలో వచ్చినా .. రాజమౌళి ఏ హీరోతో చేస్తున్నాడో అదే అతిపెద్ద కాంబో  అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అతిపెద్ద కాంబో అంటే రాజమౌళి- మహేష్ బాబు సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు.. యావత్ భారతదేశం మొత్తం ఎదురుచూస్తుంది.


ఇక ఎప్పుడెప్పుడు ssmb29 సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒకపక్క   జక్కన్న టీమ్ ప్రీ ప్రొడక్షన్  పనుల్లో బిజీగా మారింది.  ఇంకోపక్క  మహేష్.. మేకోవర్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి కనీసం ఒక చిన్న అప్డేట్ అయినా  ఇవ్వమని జక్కన్నను అభిమానులు కోరుతున్నారు.  మహేష్, రాజమౌళి  ఎక్కడ కనిపించినా.. అప్డేట్.. అప్డేట్ అంటూ అడుగుతూనే ఉన్నారు.

తాజాగా  మత్తు వదలరా 2 ప్రమోషన్స్ లో కూడా ssmb29 అప్డేట్  గురించే డిస్కషన్. రాజమౌళి అన్న కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన చిత్రం శ్రీసింహా.  సూపర్ హిట్ అయిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో  ఫరియా అబ్దుల్లా , సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్  13 న ఈ సినిమా   ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్  వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగామారారు.  ఇప్పటికే ట్రైలర్  ను ప్రభాస్  తో రిలీజ్ చేయించి  హైప్ తెచ్చుకున్న శ్రీసింహా..   తాజాగా రాజమౌళిని కూడా ఈ ప్రమోషన్స్ లోకి లాగేశాడు. శ్రీసింహా, కాల భైరవ కలిసి.. రాజమౌళితో కలిసి ప్రమోషన్  వీడియో చేశారు.

వర్క్ లో ఉన్నజక్కన్నను కదిలించి మత్తు వదలరా 2 గురించి చెప్పమని అడగ్గా.. సెప్టెంబర్ 13 న  మత్తు వదలరా 2  రిలీజ్ అవుతుంది.. టికెట్స్ బుక్ చేసుకోమని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో వెళ్లేముందు శ్రీసింహా.. SSRMB గురించి అప్డేట్ ఇవ్వమని అడగ్గా.. జక్కన్న కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చాడు.  ఇందుకు  సంబంధించిన వీడియో  నెట్టింట వైరల్ గా  మారింది. అదేంటీ జక్కన్న.. అప్డేట్ అడిగితేనే కర్రతో కొట్టేస్తావా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు  సెట్స్ మీదకు వెళ్తుంది అనేది  తెలియాలంటే  ఇంకొన్ని రోజులు ఆగక  తప్పదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×