Hyderabad: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి వేళ ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ ఏడు అనగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్గాలు పడే అవకాశముందని తెలియజేసింది.
వాతావరణ శాఖ అలర్ట్.. కాసేట్లో భారీ వర్షాలు
హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వాసులకు కీలక హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది. ఆ సమయంలో ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడనున్నాయి.
ఇతర ప్రాంతాల్లో వర్షం లేదా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుండి రాత్రి వరకు పశ్చిమ-దక్షిణ ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఇతర ప్రాంతాలలో వర్షం పడే అవకాశం తక్కువని తెలిపింది.
హైదరాబాద్‌లోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
జూన్ 7 నుంచి 10 వరకు హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాలుగు రోజులు నగరంలో భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రస్తావించింది. దీనివల్ల జనజీవనానికి ఆటంకం కలగవచ్చని తెలుస్తోంది. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించేవారు ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వర్షం పడే సమయంలో హైదరాబాద్ సిటీలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు ముందుగా బయలు దేరడం ఉత్తమం.
ALSO READ: హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ కవచ్.. రంగంలోకి సీపీ సజ్జనార్ ఓయో లాడ్జీల్లో తనిఖీలు
ఇంటి నుంచి బయలుదేరే వారు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే అప్‌డేట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐటీ కారిడారులోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ రోడ్లపై నీరు నిలిచే అవకాశముంది. పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.