E-Paper
Advertisement

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్..  ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్
Advertisement

TS Inter Results 2024 update(Latest news in telangana): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.

Advertisement

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను అతి త్వరగా వెల్లడించాలని బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇక మిగతా మూడు దశల వాల్యుయేషన్ ప్రక్రియను బోర్డు ఈనెలాఖరులోపు పూర్తి చేయనుంది. ఇది పూర్తి చేయడానికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.

Tags

Related News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌లో నకిలీ నెంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. 100 కేసులు, వాహనాలు సీజ్!

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై భట్టి సంచలన ఆదేశాలు.. వెనుకబడిన శాఖలపై ఫోకస్!

ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు.. మహిళ దుర్మరణం

వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

తెలంగాణ పల్లెల్లో మళ్లీ మోగనున్న డప్పు చాటింపులు.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×