E-Paper
Advertisement

పాండిచేరిలో ఫారినర్స్ ప్రపంచం, పైసా ఖర్చులేకుండా వారితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చు

పాండిచేరిలో ఫారినర్స్ ప్రపంచం, పైసా ఖర్చులేకుండా వారితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చు

పాండిచేరికి వెళ్లే పర్యాటకులకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. కేవలం టూరిజం మాత్రమే కాదు, భిన్న సంస్కృతులను అనుభవించే ప్రత్యేక అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా విదేశీయులతో కలిసి గడిపే సమయం ఈ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అక్కడ ప్రకృతి, ఆధ్యాత్మికత, ఫ్రెంచ్ ప్రభావం కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. ప్రశాంతమైన లైఫ్ స్టైల్, పర్యావరణంపై శ్రద్ధ, సింపుల్ జీవన విధానం దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.

అద్భుతంగా ఆకట్టుకునే సాధన ఫారెస్ట్

పాండిచేరి సమీపంలోని ఆరోవిల్లే ప్రాంతంలో ఉన్న సాధన ఫారెస్ట్ వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం ప్రత్యేకమైన పర్యావరణ ప్రాజెక్ట్‌ గా గుర్తింపు పొందింది. ఇది కేవలం ఒక అడవి కాదు. ప్రకృతితో కలిసి జీవించడం ఎలా అనే విషయాన్ని నేర్పించే జీవన విధానం. 2003లో పూర్తిగా బీడు భూమిగా ఉన్న సుమారు 70 ఎకరాల ప్రాంతాన్ని, వేలాది చెట్లతో పచ్చని అడవిగా మార్చడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇప్పటివరకు 30,000కి పైగా మొక్కలను నాటి, ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేశారు. ఈ ప్రదేశంలో ముఖ్యంగా  ట్రోపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్  అనే అరుదైన అడవి రకానికి చెందిన మొక్కలను పెంచుతున్నారు. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, నేల నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ఒకప్పుడు ఎండిపోయిన నేల ఇప్పుడు మళ్లీ పచ్చదనంతో కళకళలాడుతోంది.

ప్రకృతి ఆధారిత జీవనశైలి

ఇక్కడ జీవనశైలి పూర్తిగా ప్రకృతి ఆధారంగా ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగం లేకుండా, సౌరశక్తిని వినియోగిస్తూ, సాధారణ జీవితం గడుపుతారు. ఇక్కడ నివసించే వారు వెగాన్ విధానాన్ని అనుసరిస్తారు. అంటే జంతువుల నుండి వచ్చే పదార్థాలను ఉపయోగించరు. ఇళ్ల నిర్మాణంలో కూడా స్థానికంగా లభించే వెదురు, గడ్డి లాంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ విధానం ప్రకృతికి హాని కలగకుండా ఉండటానికి సహాయపడుతుంది. నీటి సంరక్షణ విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలుస్తోంది. వర్షపు నీటిని నిల్వచేసేందుకు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కాంటూర్లు, పర్‌ కొలేషన్ గుంతలు లాంటి పద్ధతుల ద్వారా నీటిని భూమిలోకి పంపించి భూగర్భ జలాలను పెంచుతున్నారు. దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత మెరుగుపడింది.

అక్కడికి వెళ్లడానికి బుకింగ్ అవసరం లేదు!

ప్రపంచం నలుమూలల నుంచి వాలంటీర్లు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తారు. వారు చెట్లు నాటడం, నీటి సంరక్షణ పనుల్లో పాల్గొనడం, అలాగే ఈ జీవన విధానాన్ని నేర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడికి రావడానికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. ఎవరైనా అక్కడికి వెళ్లొచ్చు. హ్యాపీగా అక్కడ జీవించవచ్చు. పాండిచేరిలో ఉదయం వేళను సాగర తీరంలో ప్రారంభించడం చాలా మంది ఇష్టపడుతారు. తెల్లవారుజామున సముద్రతీరంలో వాకింగ్ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆ తర్వాత ఫ్రెంచ్ కాలనీలకు వెళ్తే, అక్కడి భవన నిర్మాణం, వీధులు, రంగురంగుల ఇళ్ళు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి వాతావరణం యూరోపియన్ టచ్‌ తో ఆకట్టుకుంటాయి. ధ్యానం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

వైట్ టౌన్ ప్రాంతం పాండిచేరిలో మరో ప్రత్యేక ఆకర్షణ. ఫ్రెంచ్ శైలిలో నిర్మించిన ఇళ్ళు, వీధులు, కేఫ్‌లు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి కేఫ్‌లలో కూర్చుని కాఫీ తాగుతూ విదేశీ పర్యాటకులతో మాట్లాడటం ఒక మంచి అనుభవంగా ఉంటుంది. కొత్త సంస్కృతులు, జీవన విధానాల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధనా ఫారెస్ట్‌ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వెళ్లడం మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితం. సందర్శకులకు ఉచితంగా గైడ్ టూర్,  కమ్యూనిటీ భోజనం కూడా అందిస్తారు. ఈ ప్రదేశం పర్యావరణ పరిరక్షణ, సహజ జీవన విధానం, సామాజిక సేవలను కలిపే ఈ ప్రదేశాన్ని ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి.

Read Also: ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్.. అడుగు పెట్టారో ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×