E-Paper
Advertisement

Binserh Travel: ఈ వేసవికి బెస్ట్ డెస్టినేషన్.. ఉత్తరాఖండ్‌లోని ‘బిన్సార్’ పూర్తి టూర్ ప్లాన్!

Binserh Travel: ఈ వేసవికి బెస్ట్ డెస్టినేషన్.. ఉత్తరాఖండ్‌లోని ‘బిన్సార్’ పూర్తి టూర్ ప్లాన్!
Advertisement

Binserh Travel: ఎండల తీవ్రత నుంచి తప్పించుకుని.. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు ఉత్తరాఖండ్‌లోని బిన్సార్ ఒక స్వర్గధామంలా కనిపిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల అందాలు, దట్టమైన అడవులు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వారం యాత్రలో బిన్సార్ అందాలు.. అక్కడి ప్రకృతి దృశ్యాలు చూసి తరిద్దాం..

హిమాలయాల కింద పచ్చని స్వర్గం

ఉత్తరాఖండ్‌లోని సుందరమైన కొండల మధ్య, నీలి ఆకాశం కింద, పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడిపే అద్భుత ప్రదేశం బిన్సార్. త్రిశూల్, పంచచులి, శివలింగ్ వంటి హిమాలయ శిఖరాల సాక్షిగా ఇక్కడి ప్రతి అడుగు ఒక మధుర జ్ఞాపకం. అల్మోరా జిల్లాలో ఉన్న బిన్సార్..హిమాలయాల అద్భుతమైన వీక్షణలు , దట్టమైన అడవులతో కూడిన ప్రశాంతమైన హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 2,420 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం.. 16వ శతాబ్దపు శివాలయం, బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యానికి ప్రసిద్ధి.

2,412 మీటర్ల ఎత్తులో స్వర్గ దర్శనం

Advertisement

బిన్సార్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో బిన్సార్ జీరో పాయింట్ అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 2,412 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ జీరో పాయింట్‌ను చేరుకోవడానికి పర్యాటకులు బిన్సార్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలోని KMVN రెస్ట్ హౌస్ నుండి దట్టమైన అడవుల గుండా సుమారు 2 కిలోమీటర్ల చిన్న ట్రెక్ చేయాలి. ఇది ఓక్, రోడోడెండ్రాన్ అడవులతో నిండి ఉంటుంది. ఆ నడక ముగిశాక కనిపించే కేదార్‌నాథ్, నందాదేవి శిఖరాల 360 డిగ్రీల అద్భుత దృశ్యం..పర్యాటకుల శ్రమను మర్చిపోయేలా చేస్తుంది.

బిన్సార్ కొండపై ఆధ్యాత్మిక క్షేత్రం

బిన్సార్ పర్యటనలో చూడదగ్గ మరో ప్రదేశం.. కసార్‌ దేవి ఆలయం. కొండపై ఉన్న ప్రసిద్ధ ప్రాచీన కసార్ దేవి. 2వ శతాబ్దపు ఈ ఆలయం అత్యంత ఆధ్యాత్మిక శక్తికి ప్రత్యేక భూ అయస్కాంత క్షేత్రానికి ప్రసిద్ధి చెందింది. స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేశారు. కొందరి దాడుల వల్ల దెబ్బతినడంతో… 1948లో కసార్ దేవి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆధ్యాత్మికతను కోరుకునే వారికి కసార్ దేవి ఆలయం ఒక అద్భుత క్షేత్రం. అద్భుతమైన వాస్తుశిల్పం, చుట్టూ దట్టమైన పైన్ చెట్లు ఈ ఆలయానికి ప్రత్యేక అందాన్ని ఇస్తాయి.

ఖాలీ ఎస్టేట్ అనుభవం

Advertisement

ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విరామం కావాలనుకుంటే ఖాలీ ఎస్టేట్ సరైన ఛాయిస్. కుమాన్ మాజీ కమిషనర్ సర్ హెన్రీ రామ్సే నివాసమైన ఈ వారసత్వ కట్టడం.. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్లతో మనసును పరవశింపజేస్తుంది. ఇక్కడ పిక్నిక్ ఎంజాయ్ చేయడమే కాకుండా, సమీపంలోని పల్లెటూళ్లకు ట్రెక్కింగ్ కూడా వెళ్లవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణి ఔత్సాహికులకు బిన్సార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒక కలల లోకం. ఈ అభయారణ్యం, హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక పచ్చని నిధి. ఇక్కడ సుమారు 200 రకాల పక్షి జాతులు ఉన్నాయి, అడవి పిల్లులు, చిరుతపులులు, హిమాలయ నల్ల ఎలుగుబంట్లు, నక్కలు, కొండ గొర్రెలు ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఫోర్క్-టెయిల్స్, బ్లాక్-బర్డ్స్, నవ్వుతున్న థ్రష్‌లు వంటి అరుదైన పక్షుల గానం ఇక్కడ ప్రతిధ్వనిస్తుంటుంది.

భక్తుల నమ్మక శక్తి బిన్సార్ లో

చిటాయ్ గోలు దేవతా ఆలయం..బిన్సార్ శాంక్చురీకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ భక్తులు దేవుడికి మిఠాయిలు కాకుండా, ఇత్తడి గంటలను సమర్పిస్తారు. తమ కోరికలను కాగితంపై రాసి ఆ గంటలకు కడతారు. వేల సంఖ్యలో ఉన్న ఆ గంటల నాదం, భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని అత్యంత శక్తివంతమైనదిగా మార్చాయి. పరియాదేవ పాషన్..ఇది అల్మోరా-బిన్సార్ మార్గంలో ఉన్న ఒక ప్రముఖ చారిత్రక, పురావస్తు ప్రదేశం. ఇది మెగాలిథిక్ యుగానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది పర్యాటకులకు ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశం. అల్మోరా నుండి బిన్సార్ వెళ్లే దారిలో ఈ ప్రదేశం ఉంది.

ఢిల్లీ నుండి కొండ ప్రాంతాల అందాలను ఆస్వాదిస్తూ

బిన్సార్‌ను సందర్శించేందుకు అనువైన కాలం వేసవికాలం. వేసవిలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హిమాలయ శిఖరాలను స్పష్టంగా చూడవచ్చు. బిన్సార్ ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఉంది. దీనికి నేరుగా విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ లేదు, కానీ సమీప ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. బిన్సార్ సమీపంలో పంత్ నగర్ విమానాశ్రయం ఉంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా బిన్సార్ చేరుకోవచ్చు. బిన్సార్‌కు సమీపంలో కాత్ గోడమ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి బిన్సార్‌ 120 కిలో మీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో ఢిల్లీ నుండి ఆల్మోరా వచ్చి..అక్కడి నుండి బిన్సార్ వెళ్లవచ్చు. సొంత కారులో వెళ్లేవారు హల్ద్వానీ, కాత్ గోడమ్ మీదుగా కొండ ప్రాంతాల అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు.

Story by: Kanugula Kishan, Big Tv

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×