E-Paper
Advertisement

Mini-moon Vacation: యువ జంటలు మెచ్చిన కొత్త ట్రెండ్.. హనీమూన్ కంటే ముందే మినీమూన్ ఎందుకు?

Mini-moon Vacation: యువ జంటలు మెచ్చిన కొత్త ట్రెండ్.. హనీమూన్ కంటే ముందే మినీమూన్ ఎందుకు?
Advertisement

Mini-moon Vacation: సాధారణంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. దానిని హనీమూన్ అంటుంటాం. ఈ హనీమూన్ నూతన దంపతులను మానసికంగా మరింత దగ్గర చేస్తుంది. అయితే, ప్రస్తుతం పెళ్లయిన యువ జంటలు హనీమూన్‌ కంటే.. ముందు కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. దానినే ‘మినీ మూన్’ అని అంటున్నారు. పెళ్లి తర్వాత వెంటనే కొన్నిరోజుల పాటు మినీమూన్‌కు వెళ్లడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారిందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ‘థ్రిల్లోఫీలియా’ అనే ట్రావెల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. మరి హనీమూన్ కంటే ముందే మినీమూన్ ప్లాన్ చేసుకోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

మినీమూన్ అంటే..

అప్పుడే పెళ్లయిన కొత్త జంటలు పెళ్లి జరిగిన 15 రోజులు లేదా నెల రోజుల తర్వాత ఏకాంతంగా గడపడానికి హనీమూన్‌కు వెళ్తుంటారు. అయితే, ఈ థ్రిల్లోఫీలియా అనే ట్రావెల్ సంస్థ ప్రారంభించిన కొత్త ట్రెండ్ ప్రకారం.. పెళ్లి జరిగిన వెంటనే కొత్త జంటలు ట్రిప్‌కు వెళ్లడాన్నే మినీమూన్ అంటారు. అంటే.. పెళ్లి తాలూకు హడావుడి నుంచి బయటపడి సేద తీరేందుకు యువ జంటలు ఈ మినీమూన్‌ను ఎంచుకుంటున్నాయి. కేవలం 3 నుంచి 5 రోజులపాటు అలా మినీమూన్‌లో ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తీరిగ్గా హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటారన్నమాట.

పెరుగుతోన్న ఆదరణ:

Advertisement

ఈ మినీమూన్ అందించే ప్రత్యేక ప్రయోజనాల కారణంగానే రోజురోజుకీ ఈ ట్రెండ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి ట్రిప్స్‌ను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ 3-5 రోజుల ట్రిప్‌కు ఖర్చులు కూడా పెద్దగా ఉండవు. అలాగే ఉద్యోగం చేసేవాళ్లు మినీమూన్‌ కోసం ఎక్కువ సెలవులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ట్రిప్‌లో ఒకరికొకరు దగ్గరయ్యాక.. కొన్ని నెలల తర్వాత తీరిగ్గా హనీమూన్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుత యువ జంటలు ముందుగా మినీమూన్‌కు వెళ్లొచ్చి, తర్వాత దంపతులిద్దరికీ ఇష్టమైన ప్రదేశాలను ఎంచుకుని సుదీర్ఘ ట్రిప్‌కు వెళ్తున్నారు.

మానసిక ఉల్లాసానికి దోహదం:

థ్రిల్లోఫీలియా అనే ట్రావెల్ సంస్థ తీసుకొచ్చిన ఈ మినీమూన్ ట్రెండ్ వల్ల యువ జంటలు తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి, ప్రశాంతంగా సేదతీరుతున్నాయి. అలాగే నేటి యువత లగ్జరీ టూర్ల కంటే.. మానసికంగా దగ్గరయ్యే టూర్స్‌కు మొగ్గుచూపుతున్నారు. ఈ మినీమూన్‌లో భాగంగా.. సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేసేలా సముద్రయానాలు, బీచ్‌లో డిన్నర్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారు.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×