E-Paper
Advertisement

Sankranti Release Movies: గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన సంక్రాంతి సినిమాలు .. ఈవెంట్స్ అన్నీ అక్కడే.. ఎందుకంటే?

Sankranti Release Movies: గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన సంక్రాంతి సినిమాలు .. ఈవెంట్స్ అన్నీ అక్కడే.. ఎందుకంటే?
Advertisement

Sankranti Release Movies: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీకి సినిమా సెలబ్రిటీలకు కూడా పెద్ద పండుగ. సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇక 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, చిరంజీవి, నవీన్ పోలిశెట్టి, రవితేజ వంటి ఎంతోమంది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు..

ఇలా ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ చిత్ర బృందం మొత్తం గోదావరి జిల్లాలలోనే ఎక్కువగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి విడుదల సినిమాలన్నీ కూడా గోదావరి జిల్లాల టార్గెట్ చేస్తూ ఈవెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా కోస్తా జిల్లాలలోనే సినిమా ఈవెంట్లను నిర్వహించడానికి కారణం లేకపోలేదు.

గోదావరి జిల్లాలలో ప్రమోషన్ కార్యక్రమాలు..

Advertisement

సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే గోదావరి జిల్లాలలో ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం సిటీలలో ఉన్నవాళ్లు కూడా సొంత గ్రామాలకు చేరుకొని ఈ పండుగను జరుపుకుంటారు. ఇలా కుటుంబం మొత్తం ఒకే చోట చేరడంతో అందరూ కలిసి సినిమాలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. అందుకే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ సంక్రాంతి పండుగకు విడుదలయ్యే సినిమాలన్నీ కూడా గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టి అక్కడ సినిమా ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.

గోదావరి జిల్లాలో చిరు సినిమా ఈవెంట్?

Advertisement

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమా కూడా ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాటను భీమవరంలో ప్రత్యేకంగా ఒక ఈవెంట్ నిర్వహించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫస్ట్ సాంగ్ ను రాజమండ్రీలో రిలీజ్ చేశారు. ఇక సంక్రాంతి బరిలో రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి కూడా మరొక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుందని ఈ కార్యక్రమాన్ని కూడా గోదావరి జిల్లాలలోని జరుపబోతున్నట్టు సమాచారం. ఇలా సంక్రాంతి విడుదల అయ్యే సినిమాలన్నీ కూడా గోదావరి జిల్లాలలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు ఈ సినిమాలకు వర్కౌట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Niranjan Reddy: కష్టాలలో ఇండస్ట్రీ.. పార్లమెంటులో ప్రస్తావించిన నిర్మాత నిరంజన్ రెడ్డి!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×