E-Paper
Advertisement

IRCTC Update: రైలు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫుల్ రీఫండ్ పొందవచ్చు, ఎలాగో తెలుసా?

IRCTC Update: రైలు మిస్ అయ్యిందా? డోంట్ వర్రీ.. ఫుల్ రీఫండ్ పొందవచ్చు, ఎలాగో తెలుసా?
Advertisement

Ticket Deposit Receipt (TDR): తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. రైలు ఆలస్యం కావడం, కొన్నిసార్లు మిస్ కావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి వల్ల చాలా మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే, టికెట్ డబ్బులను చాలా మంది వదిలేసుకుంటారు. కానీ, ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులు IRCTC అందించే టికెట్ డిపాజిట్ రసీదు (TDR) సౌకర్యాన్ని ఉపయోగించుకుని డబ్బును రీఫండ్ చేసుకోవచ్చు. ఇంతకీ TDR పద్దతిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకీ TDR అంటే ఏంటి?

ఆలా మంది రైల్వే ప్రయాణీకులకు ఓ అపోహ ఉంటుంది. రైలు మిస్ అయినా, రిజర్వేషన్ చార్ట్ తయారు అయిన తర్వాత రీఫండ్ పొందడం సాధ్యం కాదనుకుంటారు. కానీ, అది నిజం కాదు. TDR (టికెట్ డిపాజిట్ రసీదు) వ్యవస్థ ద్వారా  డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.  రైల్వే సంబంధిత సమస్యలు, ఇతర కారణాల వల్ల ప్రయాణం ఆలస్యం అయిన సందర్భాలలో రీఫండ్ తీసుకోవచ్చు. TDR అనేది నిర్దిష్ట కారణాల వల్ల అంటే..  రైలు రద్దు అయినా, 3 గంటలు ఆలస్యం అయినా,  TDRను ఉపయోగించి, ప్రయాణీకులు రిజర్వ్ చేయబడిన, RAC , వెయిట్‌ లిస్ట్  టికెట్లకు సంబంధించి టికెట్ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. చార్ట్ తయారీ తర్వాత, స్టేషన్ మాస్టర్ల నుంచి ఆఫ్‌ లైన్‌ లో పొందిన తర్వాత ఇ టికెట్ల కోసం TDRలను IRCTC ద్వారా ఆన్‌ లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు.

TDRతో పూర్తి రీఫండ్ ఎలా పొందాలంటే?

Advertisement

TDR ద్వారా టికెట్ డబ్బులు రీఫండ్ పొందేందుకు ప్రయాణీకులు ఎక్కడికీ వెళ్లాల్సిన అసవరం లేదు. మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ముందుగా IRCTC వెబ్‌ సైట్‌ వెళ్లాలి.

Advertisement

⦿ ఆ తర్వాత లావాదేవీల మెనుకి వెళ్లి ఫైల్ TDRను ఎంచుకోవాలి.

⦿ మీరు మీ ప్రయాణాలకు వాపసు క్లెయిమ్ చేయగల లిస్ట్ ను చూస్తారు.

⦿ సంబంధిత PNR నంబర్‌ను  సెలెక్ట్ చేయాలి.

⦿ వాపసు పొందేందుకు సరైన కారణాన్ని చెప్పాలి.

⦿ సమాచారాన్ని నింపిన తర్వాత రిక్వెస్ట్ ను పంపించాలి.

⦿ ఆ తర్వాత TDR హిస్టరీకి వెళ్లడం ద్వారా రీఫండ్ ను క్లెయిమ్ స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

TDR దాఖలు చేసేటప్పుడు, టైమ్ బాండ్ ఉంటుంది. రైలు ఆలస్యం అయినప్పుడు, దరఖాస్తును బయలుదేరే ముందు,  ఇచ్చిన టైమ్ లో పు సబ్ మిట్ చేయాలి. నిర్దేశించిన టైమ్ పీరియడం తర్వాత అప్లై చేసుకుంటే, రీఫండ్ పొందడం కష్టం అవుతుంది.  వాపసు పొందడం కష్టమవుతుంది. TDRను దాఖలు చేయడానికి సరైన కారణాన్ని చెప్పాలి.  ఆ తర్వాత రైల్వే అధికారులు ఈ విషయాన్ని ఎంక్వయిరీ చేస్తారు. అంతా సక్రమంగానే ఉందని భావిస్తే రీఫండ్ ఇస్తారు.

Read Also:  మీకు తెలుసా ఓ రైల్లో ఏకంగా ఆలయం ఉంది, గణపతికి ఓ బెర్తు కూడా ఇచ్చేశారు!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×