E-Paper
Advertisement

Best Places For Winter: స్విట్జర్లాండ్ అక్కర్లేదు.. ఇండియాలోనే మంచు కురిసే బెస్ట్ స్పాట్స్

Best Places For Winter: స్విట్జర్లాండ్ అక్కర్లేదు.. ఇండియాలోనే మంచు కురిసే బెస్ట్ స్పాట్స్
Advertisement

Best Places For Winter: చలికాలం వచ్చిందంటే చాలు.. ప్రకృతి ప్రేమికులకు గుర్తొచ్చేది మంచు. పర్వత శ్రేణులు తెల్లటి మంచు దుప్పటిని కప్పుకుని, స్వర్గాన్ని తలపించే కాలం ఇది. మీరు కూడా ఈ జనవరిలో మంచులో ఆడుకోవాలని, మంచు కురుస్తుంటే చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. జనవరిలో మంచును ఎంజాయ్ చేయడానికి ఇండియాలోని ఉత్తమమైన 12 ప్రాంతాలు ఇవే.

1. గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్:
భారతదేశపు ‘స్విట్జర్లాండ్’ గా పిలువబడే గుల్మార్గ్, జనవరిలో మంచు ఇష్టపడే వారికి మొదటి ఛాయిస్. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన ‘గోండోలా రైడ్’ (కేబుల్ కార్) ద్వారా మంచు పర్వతాల పైకి వెళ్లవచ్చు. స్కీయింగ్ చేయడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశం.

Advertisement

2. సోనామార్గ్, జమ్మూ కాశ్మీర్:
‘బంగారు మైదానం’ అని పిలిచే సోనామార్గ్ జనవరిలో పూర్తిగా తెల్లగా మారిపోతుంది. థాజివాస్ గ్లేసియర్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. చుట్టూ మంచుతో నిండిన శిఖరాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

3. మనాలి, హిమాచల్ ప్రదేశ్:
హనీమూన్ జంటలకు.. స్నేహితులకు మనాలి హాట్ ఫేవరెట్. జనవరిలో ఇక్కడ మంచు కురవడం సర్వసాధారణం. మనాలిలోని మాల్ రోడ్, సోలాంగ్ వ్యాలీ , రోహ్‌తంగ్ పాస్ (అందుబాటులో ఉంటే) మంచులో ఆటలకు కేరాఫ్ అడ్రస్.

Advertisement

4. రోహ్‌తంగ్ పాస్, హిమాచల్ ప్రదేశ్:
మనాలికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ దాదాపు ఏడాది పొడవునా మంచు కనిపిస్తుంది. కానీ జనవరిలో దీని అందం రెట్టింపు అవుతుంది.

5. షిమ్లా , కుఫ్రీ, హిమాచల్ ప్రదేశ్:
హిమాచల్ రాజధాని షిమ్లాలో జనవరిలో మంచు వర్షం కురుస్తుంది. షిమ్లాకు కొద్ది దూరంలో ఉండే కుఫ్రీలో ఐస్ స్కేటింగ్ , యాక్ రైడ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

6. ఔలి, ఉత్తరాఖండ్:
ఔలి భారతదేశపు అగ్రశ్రేణి స్కీయింగ్ గమ్యస్థానం. ఇక్కడ నుంచి నందాదేవి పర్వత శిఖరాలను స్పష్టంగా చూడవచ్చు. జనవరిలో ఇక్కడ జరిగే స్కీయింగ్ ఛాంపియన్‌షిప్‌లు చాలా ఫేమస్.

7. నైనిటాల్, ఉత్తరాఖండ్:
నైనిటాల్‌లోని మంచు పర్వతాల మధ్య ఉండే నైని సరస్సు జనవరిలో అద్భుతంగా కనిపిస్తుంది. ‘స్నో వ్యూ పాయింట్’ ద్వారా హిమాలయాల అందాలను చూడవచ్చు.

8. మున్సియారి, ఉత్తరాఖండ్:
ట్రెక్కర్లకు ఇది స్వర్గం. పితూర్‌ఘర్ జిల్లాలో ఉండే ఈ ప్రాంతం నుంచి పంచచూలి శిఖరాలు అద్భుతంగా కనిపిస్తాయి. జనవరిలో ఇది పూర్తి శీతాకాలపు అందాలను సంతరించుకుంటుంది.

9. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్:
ఈశాన్య భారతంలో మంచు చూడాలనుకునే వారికి తవాంగ్ సరైన చోటు. ఇక్కడ ఉండే సెలా పాస్, బౌద్ధారామాలు మంచులో మెరిసిపోతూ కనిపిస్తాయి.

10. ఉత్తర సిక్కిం (లాచుంగ్ & యుమ్తాంగ్ వ్యాలీ):
జనవరిలో సిక్కిం చాలా చల్లగా ఉంటుంది. లాచుంగ్, యుమ్తాంగ్ వ్యాలీలు మంచుతో నిండిపోయి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

11. ధర్మశాల, మెక్లీడ్‌గంజ్, హిమాచల్ ప్రదేశ్:
దలైలామా నివసించే ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు, అందాలకు నిలయం. జనవరిలో ధౌలాధర్ శ్రేణులు మంచుతో మెరిసిపోతుంటే చూడటం ఒక మధుర జ్ఞాపకం.

12. లడఖ్:
సాహస ప్రియులకు మాత్రమే జనవరిలో లడఖ్ అనుకూలం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. పాంగాంగ్ సరస్సు గడ్డకట్టి అద్దంలా మారిపోవడం ఇక్కడి ప్రత్యేకత.

జాగ్రత్తలు:

సరిపడా  స్వెటర్లు, గ్లౌజులు, స్నో బూట్లు వెంట తీసుకెళ్లండి.

మంచు కారణంగా రోడ్లు మూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి.

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×