E-Paper
Advertisement

Anil Ravipudi: హమ్మ అనీలూ.. AIని కూడా వదల్లేదా? సెల్ఫీ ట్రెండ్‌తో వింటేజ్ చిరును మళ్లీ గుర్తుచేశావుగా!

Anil Ravipudi: హమ్మ అనీలూ.. AIని కూడా వదల్లేదా? సెల్ఫీ ట్రెండ్‌తో వింటేజ్ చిరును మళ్లీ గుర్తుచేశావుగా!
Advertisement

Anil Ravipudi: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదోక కొత్త అంశం వెలుగు చూస్తుంది. అది విపరీతంగా వైరల్‌ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఏఐ వచ్చాక.. ఎన్నో వింతలు, విశేషాలు కళ్లముందు దర్శనం ఇస్తున్నాయి. అసాధ్యమైనవి కూడా ఫోటోలు, రీల్స్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ఏఐ టెక్నాలజీ చనిపోయిన వారిని కూడా పుట్టిస్తుంది. అంతేకాదు వారితో ఫోటోలు దిగినట్టు కూడా క్రియేట్‌ చేస్తుంది. అలా ఏఐతో అసాధ్యమైనవి కూడా సాధ్యం చేసుకుంటున్నారు నెటిజన్స్. ఏఐ ద్వారా కొత్తగా ఏదోకటి సృష్టిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు.

ఏఐతో వింతలు

Advertisement

ముఖ్యంగా సినీ సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడం లేదా.. వారిని తమకు నచ్చిన లుక్‌లో మార్చేయడం ఇలా ఏదోక వింతను క్రియేట్‌ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏఐ నుంచి కొత్తగా పుట్టుకొచ్చింది సెల్పీ వీడియో. సినీ సెలబ్రిటీలతో మూవీ సెట్‌లో సెల్ఫీలు దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. సామాన్యులంత హీరోలతో మూవీ సెట్‌లో ఫోటోలు దిగుతున్నట్టుగా క్రియేట్‌ చేసి దాన్ని చూసుకుంటు మురిసిపోతున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే ఫాలో అయ్యారు. ఈ ట్రెండీ వీడియోని మొదటిసారి ఓ సెలబ్రిటీ వాడారు. ఆయనే స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఏఐ సెల్ఫీ వీడియోతో వింటేజ్‌ చిరుని గుర్తు చేశారు.

అనిల్ రావిపూడి కూడా

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ సినిమా నుంచి ఇంద్ర, గ్యాంగ్‌ లీడర్‌, ముఠామేస్త్రీ, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఠాగుర్, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌తో పాటు తన లేటెస్ట్‌ మూవీ మన శంకర వరప్రసాద్‌ చిత్రాల వరకు ఇలా ఆయన హిట్‌ సినిమాల్లోని మూవీ సెట్‌లో చిరుతో సెల్ఫీ ప్రయాణాన్ని చూపించారు. అనిల్‌ ఫోన్‌తో ఇలా చిరు సినిమాల్లో సెట్లో ఫోటోలు తీసుకుంటున్నట్టుగా తన సెల్ఫీ వీడియోని క్రియేట్‌ చేశారు. దీని ద్వారా ఆయన వింటేజ్ చిరుని చూపించారు. ఈ వీడియోని స్వయంగా అనిల్‌ రావిపూడి షేర్‌ చేయడం విశేషం. దీనికి ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు‘ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

ఏఐకి థ్యాంక్స్

Advertisement

ఈ సందర్భంగా AIకి థ్యాంక్స్‌ చెప్పడంతో పాటు ఏఐని ఇలా పద్దతిగా వాడోచ్చు అంటూ టెక్నాలజీ మిస్‌ యూజ్ చేస్తున్నవారికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇలా ఈ వీడియోతో అనిల్‌ తన కలను నేరవేర్చుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తున్న తనదైన స్టైల్లో చురక అట్టించారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి, చిరంజీవి సెల్పీ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. కాగా ప్రస్తుతం ఆయన చిరంజీవిని డైరెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు హీరోగా మన శంకర వరప్రసాద్‌ గారూ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇందులో చిరు సరసన హీరోయిన్‌ నయనతార నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×