E-Paper
Advertisement

క్వీన్ ఆఫ్ హిల్స్ ‘ముస్సోరీ’.. తప్పక చూడాల్సిన 7 టాప్ టూరిస్ట్ స్పాట్స్!

క్వీన్ ఆఫ్ హిల్స్ ‘ముస్సోరీ’.. తప్పక చూడాల్సిన 7 టాప్ టూరిస్ట్ స్పాట్స్!
Advertisement

Mussoorie top 7 places to visit: ప్రకృతి అందాలు, చల్లటి గాలి, మబ్బులు పలకరించే మంచు కొండలు.. ఇవన్నీ ఒకే చోట చూడాలంటే ముస్సోరీ వెళ్లాల్సిందే! “క్వీన్ ఆఫ్ హిల్స్” అని పిలిచే ఈ అందమైన హిల్ స్టేషన్ ప్రతి ఒక్కరి ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో ఖచ్చితంగా ఉంటుంది. వీకెండ్ లో సరదాగా గడపాలన్నా, లేదా పాట్నర్ తో పెళ్లి తర్వాత ట్రిప్ వేయాలన్నా ముస్సోరీ పర్ఫెక్ట్ ఛాయిస్. మరి మసూరీ వెళ్లినప్పుడు మీ ట్రిప్‌ను మైండ్ బ్లాకింగ్ జ్ఞాపకంగా మార్చే 7 అద్భుతమైన ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం!

1. కేంప్టీ ఫాల్స్ (Kempty Falls):

ముస్సోరీకి వెళ్తే కేంప్టీ ఫాల్స్ చూడకుండా తిరిగొస్తే మీ ట్రిప్ ఇన్ కంప్లీట్ అయినట్లే! ఎత్తైన కొండల మధ్య నుంచి ఉరికే ఈ వాటర్ ఫాల్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇక్కడ నీళ్లలో కేరింతలు కొట్టడం, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా స్నానం చేయడం క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

2. మాల్ రోడ్ (Mall Road):

Advertisement

ముస్సోరీలో ‘మాల్ రోడ్’ బెస్ట్ అని చెప్పవచ్చు. సాయంత్రం వేళల్లో ఇక్కడ వాకింగ్ చేస్తూ షాపింగ్ చేయడం, వేడి వేడి మోమోస్, మ్యాగీ తింటూ లైటింగ్స్ ఎంజాయ్ చేయడం వేరే లెవల్ ఫీలింగ్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోటోల కోసం ఇక్కడ బెస్ట్ స్పాట్స్ ఉంటాయి.

3. గన్ హిల్ (Gun Hill):

ముస్సోరీలో రెండవ ఎత్తైన ప్రదేశం గన్ హిల్. ఇక్కడికి వెళ్లడానికి రోప్‌వే రైడ్ అందుబాటులో ఉంటుంది. రోప్‌వేలో వెళ్తున్నప్పుడు కింద కనిపించే మసూరీ అందాలు, చుట్టూ ఉన్న హిమాలయ పర్వత పంక్తులు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

4. లాల్ టిబ్బా (Lal Tibba):

Advertisement

ప్రశాంతతను, నేచర్ కోరుకునే వారికి లాల్ టిబ్బా సరైన స్పాట్. మసూరీలోనే అత్యంత ఎత్తైన ఈ ప్రదేశం నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం మరచిపోలేని ఫీల్ ఇస్తుంది. ఇక్కడ అమర్చిన టెలిస్కోప్ ద్వారా దూరంగా ఉన్న మంచు కొండలను స్పష్టంగా చూడవచ్చు.

5. కంపెనీ గార్డెన్ (Company Garden):

రంగురంగుల విదేశీ పూలమొక్కలు, అందమైన ఫౌంటెన్లు, చిన్న వాటర్ ఫాల్ తో ఈ గార్డెన్ అలరిస్తుంది. ఫ్యామిలీతో వెళ్లే వారికి, ఫోటోషూట్స్ ఇష్టపడే వారికి ఇది గ్రేట్ స్పాట్. ఇందులో బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంది.

6. క్లౌడ్స్ ఎండ్ (Cloud’s End):

ముస్సోరీ సిటీ  ముగిసే చోట ఉండే ఈ ప్రాంతం దట్టమైన దేవదార్, ఓక్ చెట్లతో నిండి ఉంటుంది. మేఘాలు కొండలను తాకుతూ వెళ్లే.. సీన్ ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. నిశ్శబ్ద వాతావరణం, ప్రకృతితో సమయం గడపాలనుకునే వారికి ఇది ఒక పారడైజ్.

Also Read: బీచ్ లవర్స్ కోసం పాండిచ్చేరి స్పెషల్.. బడ్జెట్, బ్యూటీ కలగలిపిన 5 హాట్‌స్పాట్స్!

7. దలై హిల్స్ (Dalai Hills):

హ్యాపీ వ్యాలీకి దగ్గరలో ఉండే దలై హిల్స్ ప్రశాంతతకు నిలయం. కొండ పైన ఉన్న బుద్ధుడి విగ్రహం, మరికొన్ని సీన్స్ టిబెటన్ వైబ్‌ను అందిస్తాయి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల లోయల వ్యూ అద్భుతంగా ఉంటుంది.

సిటీ లైఫ్ రొటీన్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలనుకునే వారికి మసూరీ ఒక బెస్ట్ డెస్టినేషన్. మీ నెక్స్ట్ వెకేషన్‌కి మసూరీ ప్లాన్ చేసి, ఈ 7 అద్భుతమైన ప్రదేశాలను కవర్ చేస్తూ స్వీట్ మెమోరీస్‌ను సొంతం చేసుకోండి.

Tags

Related News

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

Big Stories

Advertisement
×