E-Paper
Advertisement

ఇవి విదేశీ బీచ్‌లు అనుకుంటే పొరపాటే.. వైజాగ్‌లోని బీచ్‌ల గురించి తెలుసా?

ఇవి విదేశీ బీచ్‌లు అనుకుంటే పొరపాటే.. వైజాగ్‌లోని బీచ్‌ల గురించి తెలుసా?
Advertisement

Vizag Beaches: విశాఖపట్నం.. ఈ పేరు వినగానే మన కళ్ళముందు మెదిలే మొదటి దృశ్యం అనంతమైన నీలి సాగరం, అలల హోరు, ఆ తీరానికి తోడుగా నిలిచే పచ్చని కొండలు. చల్లటి వాతావరణంలో కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే మనందరికీ గుర్తొచ్చే మొదటి ప్రదేశం బీచ్. అందులోనూ వైజాగ్ బీచ్‌లకు ఉన్న ప్రత్యేకత, అక్కడి గాలిలో ఉండే స్వచ్ఛత మరే నగరంలోనూ కనిపించదు.

ఆర్కే బీచ్ (Rama Krishna Beach)

Advertisement

సాయంత్రం అవుతుందంటే చాలు, వైజాగ్ నగరం ఒక కొత్త రూపాన్ని ఏర్పరచుకుంటుంది. తీరం వెంబడి వీచే ఆ చల్లటి గాలి, పాదాలను తాకి వెళ్లే కెరటాలు మనల్ని ఏదో తెలియని పరవశానికి గురిచేస్తాయి. ఆ సమయంలో అక్కడ ఉంటే, మనం నిజంగా ఒక సాధారణ భారతీయ నగరంలో ఉన్నామా లేక విదేశాల్లోని ఏదైనా అందమైన ద్వీపంలో ఉన్నామా అనే సందేహం కలగక మానదు. ముఖ్యంగా ఆర్కే బీచ్ (రామకృష్ణ బీచ్) లో సాయంత్రం పూట పర్యాటకుల సందడి, ఫుడ్ స్టాల్స్ నుంచి వచ్చే గుమగుమలు, ఐఎన్ఎస్ కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం వెలుగులు పర్యాటకానికి నిండుదనాన్ని ఇస్తాయి.

రిషికొండ బీచ్ (Rushikonda Beach)

Advertisement

వైజాగ్ అందాలను మరింత లోతుగా చూడాలంటే రిషికొండ బీచ్‌కు వెళ్లాల్సిందే. నీలిరంగు నీరు, బంగారు వర్ణంలో మెరిసే ఇసుక ఈ బీచ్ సొంతం. కేవలం ప్రకృతి ప్రేమికులకే కాకుండా, సాహసాలు ఇష్టపడే వారికి కూడా ఇది స్వర్గం. స్పీడ్ బోటింగ్, కయాకింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌తో ఇక్కడ గడిపే సమయం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. మరోవైపు, అల్లకల్లోలం లేని ప్రశాంతతను కోరుకునే వారికి యారాడ బీచ్ ఒక గొప్ప వరం. మూడు వైపులా ఎత్తైన కొండలు, ఒకవైపు సముద్రంతో ఉండే ఈ బీచ్ చూస్తుంటే ప్రకృతి మాత తన అరచేతిలో మనల్ని ఉంచుకున్నట్లు అనిపిస్తుంది.

భీమిలి బీచ్ (Bheemunipatnam Beach)

నగరానికి కాస్త దూరంగా వెళ్తే భీమిలి (బీమునిపట్నం) బీచ్ మనల్ని పలకరిస్తుంది. డచ్ కోటల ఆనవాళ్లు, ప్రశాంతమైన అలల హోరుతో ఈ తీరం ఎంతో నిశ్శబ్దంగా, హుందాగా ఉంటుంది. ఇక సినిమాల్లో మనం చూసే అందమైన లోకేషన్లు గంగవరం బీచ్ వద్ద దర్శనమిస్తాయి. ఈ బీచ్‌లోని రాతి నిర్మాణాలు, తీరప్రాంతం కెమెరా కంటికి అద్భుతంగా కనిపిస్తాయి. తెన్నేటి పార్క్ నుండి సముద్రాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. కొండ పైనుండి అనంతమైన సాగరాన్ని చూస్తూ.. అక్కడ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను వీక్షిస్తుంటే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది.

ఇవి మాత్రమే కాదు.. యారాడ, తొట్లకొండ బీచ్‌లు సైతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడికి వెళ్తే.. అసలు మీకు టైమే తెలియదు. వైజాగ్ బీచ్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది వైజాగ్ ప్రజల జీవనశైలిలో ఒక భాగం. ఉదయాన్నే చేసే వాకింగ్ నుండి, అర్థరాత్రి వరకు సాగే స్నేహితుల కబుర్ల వరకు ప్రతి సందర్భానికీ ఈ తీరం వేదికవుతుంది. అందుకే, మనసు నిండా సంతోషాన్ని, ఊపిరి నిండా స్వచ్ఛమైన గాలిని నింపుకోవాలంటే విశాఖ తీరం కంటే మించిన ప్రదేశం మరొకటి లేదుమో అనిపిస్తుంది.

Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×