BigTV English

Lasya : కూలీగా యాంకర్ లాస్య.. అయ్యో పాపం ఏమైంది..?

Lasya : కూలీగా యాంకర్ లాస్య.. అయ్యో పాపం ఏమైంది..?

Anchor Lasya : బుల్లితెర పై ఒకప్పుడు యాంకర్ హవాను కొనసాగించిన వారిలో యాంకర్ లాస్య కూడా ఒకరు.. యాంకర్ రవీతో కలిసి చేసిన ప్రతి షో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అప్పటిలో వీరిద్దరూ లవ్ లో ఉన్నారంటు వార్తలు కూడా వినిపించాయి. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ లాస్య వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు చెబుతూ వచ్చింది. చివరకు సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.. పెళ్లి తర్వాత యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఒకవైపు సోషల్ మీడియాలో క్రేజ్ ను అందుకుంటూ వస్తుంది. తన లేటెస్ట్ ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్న లాస్య కూలీగా మారింది. అదేంటి అనే సందేహం కూడా వస్తుంది కదూ.. ఆ ఫోటో వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


యాంకర్ లాస్య గతంలో పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవరించింది. తన అందం అల్లరితో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆమె చేసిన ప్రతి షో మంచి టీఆర్పీ రేటింగ్ ను అందుకుంది. ఇక సడెన్ షాక్ ఇస్తూ మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత బుల్లి తెరకు దూరం అయ్యింది. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్ లో మెరుస్తూ వస్తుంది. గతంలో ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నది. తన అల్లరితో, వంటలతో హౌస్ లోని వాళ్లనే కాదు. ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరు సినిమాలతో, సీరియల్స్ లతో ఫుల్ బిజీ అయ్యారు. కానీ ఈమె మాత్రం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యింది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా తన భర్తతో కలిసి రీల్స్ చేస్తూ వస్తుంది.

అయితే తాజాగా లాస్య కూలీగా మారిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చంకలో చంటి బిడ్డను పెట్టుకుని, ఆమె ఎర్రటి ఎండలో ఇటుకలు మోస్తుంది. లాస్య దీన స్థితి చూసి ఫ్యాన్స్ ఆవేదన చెందారు. అయ్యో పాపం ఆమెకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఇది నిజంగానే జరిగిందా లేదా ఏదైన ఫొటోలకు పోజులు ఇచ్చిందా అనేది తెలియలేదు కానీ ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అసలు విషయం ఏంటంటే.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫోటోలను చూసి అయ్యో పాపం అంటున్నారు.. నిజానికి అదొక ఫోటో షూట్ లో ఫోటో… ఉమెన్ ఎమ్పవ్ర్మెంట్ తెలియజేస్తూ.. సదరు ఫోటో షూట్ ఆమె చేశారు. అదన్నమాట సంగతి. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. ఇతర మాధ్యమాల్లో కూలీగా ఉన్న లాస్య లుక్ కాస్త ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా లాస్య చేసిన ఫోటో షూట్ మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందరు ఈ ఫోటోల పైనే మాట్లాడుకుంటున్నారు..


 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Big Stories

×