E-Paper
Advertisement

Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’  ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్
Advertisement

Lucky Bhaskar : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ మంచి నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తెలుగులో సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. పలు కారణాల వల్ల ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దీపావళిక కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్ డేట్

Advertisement

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.  80ల కాలం నాటి కథతో రాబోతున్న ఈ మూవీ గురించి దుల్కర్ సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 31న తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయ్యింది. ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ను సినిమా రిలీజ్ డేట్ కి దాదాపు వారం రోజుల ముందుగా అంటే అక్టోబర్ 24న రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగావంశీ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి గూడ న్యూస్ చెప్పారు.

విజయ్ వల్ల సినిమా వాయిదా

Advertisement

‘లక్కీ భాస్కర్’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 7న థియేటర్లోకి తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే అందులో దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గోట్ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’  సినిమా కూడా ఒక కారణం అని చెప్పాలి. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ హైప్ తో థియేటర్లలోకి రావడంతో ‘లక్కీ భాస్కర్’ మూవీని సోలోగా రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్ మూవీని అక్టోబర్ 31కి వాయిదా వేశారు. ఇక ఇప్పటికే సినిమాలో నుంచి రిలీజ్ అయిన ‘శ్రీమతి గారు’ అనే సాంగ్, టైటిల్ ట్రాక్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ మూవీకి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేయనున్నారు. మరి ఎప్పటిలాగే దుల్కర్ సల్మాన్ ఈసారి కూడా తెలుగులో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×