E-Paper
Advertisement

Samsung Galaxy Z Tri Fold 2: సాగదీస్తే ట్యాబ్లెట్, మడతపెడితే ఫోన్.. శాంసంగ్ జెడ్ ట్రైఫోల్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్!

Samsung Galaxy Z Tri Fold 2: సాగదీస్తే ట్యాబ్లెట్, మడతపెడితే ఫోన్.. శాంసంగ్ జెడ్ ట్రైఫోల్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Samsung Galaxy Z Tri Fold 2: యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న శాంసంగ్ ప్రతి ఏటా వినూత్న ప్రయోగాలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో డిమాండ్‌ను ఏర్పరచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. కంపెనీ తమ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. గతంలో వచ్చిన మోడల్‌ను నిలిపివేసినప్పటికీ, అంతకంటే మెరుగైన ఫీచర్లతో ‘Galaxy Z Tri Fold 2’ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం పాత వెర్షన్‌కు అప్‌డేట్ మాత్రమే కాదు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటోందని సమాచారం.

మరింత స్టైల్‌గా ట్రిపుల్ ఫోల్డ్ 2..

గతంలో వచ్చిన ట్రిపుల్ ఫోల్డ్ మోడల్ కేవలం శాంసంగ్ టెక్నాలజీ పవర్‌ను చూపించడానికి మాత్రమే పరిమితమైంది. కానీ, రాబోయే సెకండ్ జనరేషన్ ఫోన్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయాలని కంపెనీ భావిస్తోంది. దీనికోసం హింజ్ వ్యవస్థను పూర్తిగా రీడిజైన్ చేస్తోంది. ఈ మార్పు వల్ల ఫోన్ మడత పెట్టినప్పుడు స్క్రీన్‌పై వచ్చే గీతలు చాలా వరకు తగ్గుతాయని, ఫోన్ మరింత స్ట్రాంగ్‌గా మారుతుందని సమాచారం. అలాగే ఈ ఫోన్‌ను చాలా స్లిమ్‌గా, బరువు తక్కువగా రూపొందించడంపై ఇంజనీర్లు దృష్టి పెట్టారని సమాచారం.

Advertisement

Also Read: బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.20,000 తగ్గింపు!

అంచనాలు మించుతున్న స్లిమ్ డిజైన్..

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లు మడత పెట్టినప్పుడు కాస్త లావుగా అనిపిస్తాయి. అయితే శాంసంగ్ తన కొత్త ట్రిపుల్ ఫోల్డ్ 2 విషయంలో ఈ సమస్యను అధిగమించనుంది. ఇది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కంటే కొంచెం ఎక్కువ మందంతో, సుమారు 9 నుండి 10 మి.మీ. లోపే ఉండే అవకాశం ఉంది. ఇది పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటమే కాకుండా, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్తగా రానున్న స్లైడబుల్ స్క్రీన్..

Advertisement

శాంసంగ్ కేవలం ఫోల్డింగ్ ఫోన్లకే పరిమితం కాకుండా, ‘గెలాక్సీ జెడ్ స్లైడ్’ పేరుతో మరో సరికొత్త హైబ్రిడ్ డివైజ్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనిలో స్క్రీన్‌ను పక్కకు లాగడం ద్వారా 7 అంగుళాల పెద్ద డిస్‌ప్లేగా మార్చుకోవచ్చు. దీనికోసం మ్యాన్యువల్ స్లైడింగ్ మెకానిజంను ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్లైడబుల్ ఫోన్ 2027 చివరలో లేదా 2028 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోల్డింగ్ ఫోన్ల మడతలతో ఇబ్బంది పడేవారికి ఈ స్లైడబుల్ ఫోన్లు ప్రత్యామ్నాయంగా నిలువనున్నాయి.

Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకొనే ఎమర్జెన్సీ యాప్స్, మ్యాప్‌తో సహా అన్నీ!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×