E-Paper
Advertisement

Big TV Kissik Talks Show: నాపై పూజలు చేయించారు.. ఎందుకంటే? – యాంకర్ రవి

Big TV Kissik Talks Show: నాపై పూజలు చేయించారు.. ఎందుకంటే? – యాంకర్ రవి
Advertisement

Big TV Kissik Talks Show: నాతో పాటు కలిసి యాంకరింగ్ చేసిన వాళ్లే, నాతో జర్నీ చేసిన వాళ్లే నాపై పూజలు చేయించారని అన్నారు స్టార్ యాంకర్ రవి (Anchor Ravi). తాజాగా ఆయన బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో‌ (Big TV Kissik Talks Show)లో గెస్ట్‌గా పాల్గొన్నారు. తన లైఫ్‌లో తనకు కష్టం కలిగించిన వారు కూడా మంచి ఉండాలని దేవుడిని ప్రార్థిస్తానని అన్నారు. అలాంటి తనపై కావాలని పూజలు జరిపించారనే షాకింగ్ విషయాన్ని రవి రివీల్ చేశారు. వారు ఎందుకు అలా చేశారనేదాని గురించి ఆయన మాట్లాడుతూ..

Also Read- Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి

నేను దేవుడిని అదే వేడుకుంటా..

Advertisement

‘‘నేనెప్పుడూ దేవుడి గుడికి వెళ్లి, వాడు నాశనం అవ్వాలని కోరుకుంటే.. అది నిజం అవుతుందని నేనెప్పుడూ నమ్మలేదు. గుడికి వెళ్లి.. నేను ఇది చేస్తున్నా, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వు, మధ్యలో ఆగిపోకుండా ముందు తీసుకెళ్లు అని మాత్రమే ప్రార్థిస్తా. కొంతమంది అన్నీ ట్రై చేసిన తర్వాత, వాళ్లు అనుకున్నది జరగకపోతే.. వాళ్లు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్లిపోయి.. నేను బాగుండాలి అనికాకుండా, వాడు వెనక్కి పోవాలని మొక్కుతుంటారు. వాడు వెనక్కి పోతే.. నేను ముందుకు పోతా అని మొక్కుతారు. అది పని చేయదు. ఇండస్ట్రీలో అది చాలా కామన్. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్ల దగ్గర నుంచి చూశా. పూజలు చేయడం, పూజలు చేయించడం వంటివన్నీ చూశా. నాకు అలాంటి పరిస్థితి వస్తే.. వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటా.

Also Read- Anchor Ravi: ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా విజయ్ దేవరకొండకు ఫరక్ పడదు

క్షుద్రపూజలు అవి ఇవి కాదు కానీ

Advertisement

ఒకవేళ నేను తప్పు చేస్తున్నా.. నా మనస్సాక్షికి అది రైట్ అనుకునే ముందుకు వెళ్తున్నా. కొంతమంది యాంకర్స్ పూజలు చేయించారు. వాళ్లు ఒక్కరే ఉండరు. పక్కన ఎవరో ఒకరిని పెట్టుకునే అవి చేయిస్తారు కాబట్టి, తెలిసిపోతూనే ఉంటాయి. నాతో పాటు కలిసి యాంకరింగ్ చేసిన వాళ్లే, నాతో జర్నీ చేసిన వాళ్లే నాపై పూజలు చేయించారు. క్షుద్రపూజలు అవి ఇవి కాదు కానీ.. వీడు బాగుపడకూడదు, ఎక్కడున్నాడో అక్కడే ఉండాలి, ఎదగకూడదు అనేలా పూజలు చేయించారు. అయినా సరే, ఎవరైనా వచ్చి నాకు వాళ్లు ఇలా అలా అని చెబితే.. నేనసలు పట్టించుకోను.. ఎక్కడిది అక్కడే వదిలేస్తా. పక్కోడి గురించి నాకొద్దు.. నాకు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను రోజూ చూస్తారో.. వాళ్ల గురించి మాత్రం వింటా. వాళ్లకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, రాబోతుందని తెలిసినా.. వెంటనే నేను రియాక్ట్ అవుతాను’’ అని రవి ఈ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read- Pawan Kalyan: ఆ కుటుంబానికి ప్రతి నెల రూ.12,000 పంపిస్తున్న పవన్ కళ్యాణ్.. నిర్మాత బయటపెట్టిన షాకింగ్ విషయం..!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×