E-Paper
Advertisement

Kissik Talks: నా దగ్గర 85 కేజీల బంగారం ఉంది.. అప్పుడు నా భార్య కాళ్లు పట్టుకుంటా! – యాంకర్ రవి

Kissik Talks: నా దగ్గర 85 కేజీల బంగారం ఉంది.. అప్పుడు నా భార్య కాళ్లు పట్టుకుంటా! – యాంకర్ రవి
Advertisement

Kissik Talks: ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద తోపు, తురుమైనా.. ఒక దేవత ఎదురు ఉన్నావ్.. ఆగిపోవాలి అంతే అని అన్నారు భార్య విషయంలో యాంకర్ రవి. తన ఇంట్లో ఉన్న బంగారం గురించి, భార్యతో వచ్చే గొడవలు గురించి.. తాజాగా తను అటెంటైన ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks)లో యాంకర్ రవి (Anchor Ravi) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

నా దగ్గర 60 కేజీలు, 25 కేజీల బంగారం ఉంది

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా.. నీ దగ్గర ఎంత బంగారం ఉంది? మీ భార్య బంగారం కావాలని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. ‘‘నా దగ్గర ఉన్న బంగారం మొత్తం చెప్పాలంటే ఒకటేమో 25 కేజీలు, ఇంకోటేమో 60 కేజీల బంగారం ఉంది. నా బిడ్డ, నా భార్య. ఈ బంగారానికి మించి నా దగ్గర ఏం లేదు. నాకు కానీ, నా భార్యకు కానీ బంగారం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అక్షయ తృతీయ రోజు మాత్రం కొద్దిగా బంగారం పెట్టి, నా కూతురికి పూజ చేస్తాం. అలా చిన్న చిన్నగా ఎంతయితే అవసరమో అంతే కొన్నాం. నాకు భూమి మీద డబ్బులు పెట్టడం అంటే ఇష్టం. టాక్స్‌లన్నీ పర్ఫెక్ట్‌గా కడుతూ, భూమిని కొంటూ ఉంటాను. అలా ల్యాండ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తా. నాకు ఎంత అవసరమో, అంతే ఆస్తులు ఉన్నాయి. నా బిడ్డ చదువు కోసం, మా అమ్మనాన్న హెల్త్ కోసం చూసుకుంటాం. నా దగ్గర డబ్బులుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తా.. లేదంటే వెకేషన్‌కి వెళ్తా. నాకు, నా భార్యకు వెకేషన్స్ అంటే చాలా ఇష్టం.. వెళ్లి ఎంజాయ్ చేసి వస్తాం.

Advertisement

Also Read- Big TV Kissik Talks Show: నాపై పూజలు చేయించారు.. ఎందుకంటే? – యాంకర్ రవి

భార్యతో గొడవలు ఎప్పుడు వస్తాయంటే..

మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. తను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయను. నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయను. కావాలని కాదు, ఏదో పనిలో ఉంటా.. అప్పుడు మాట్లాడలేను. తప్పు నాదే అని చెప్తా. అలాంటి సందర్భాల్లో చిన్నచిన్న గొడవలు వస్తాయి తప్పితే.. పెద్ద గొడవల వరకు మేం వెళ్లం. ఏదైనా గొడవ జరిగితే.. గట్టిగా అరుస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత కూల్ అవుతుంది. అప్పుడు వెళ్లి ఒక హగ్ ఇస్తా. కాళ్లు పట్టుకుంటా. ఇంకొంచెం ఇరిటేట్ చేసి, ఏదో ఒక విధంగా నవ్విస్తా. అంతే మొత్తం సెట్టయిపోతుంది. భార్యని మనం అర్థం చేసుకోకపోతే ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకుంటారు. పిల్లలను కనిచ్చి, అమ్మనాన్నలను కేర్‌గా చూసుకుంటుంది. చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంత కోపం ఉన్నా.. అక్కడికి వచ్చి ఆగిపోవాలి అంతే. ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద తోపు, తురుమైనా.. ఒక దేవత ఎదురు ఉన్నావ్.. ఆగిపోవాలి అంతే’’ అని రవి బహుచక్కగా చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read- Kissik Talks: చిరంజీవిని అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. కానీ అంత ఈజీ కాదు – యాంకర్ రవి

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×