E-Paper
Advertisement

Kissik Talks: ఇండస్ట్రీలో రికమండేషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది.. అర్జున్ కళ్యాణ్ సంచలన నిజాలు!

Kissik Talks: ఇండస్ట్రీలో రికమండేషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది.. అర్జున్ కళ్యాణ్ సంచలన నిజాలు!
Advertisement

Kissik Talks: అర్జున్ కళ్యాణ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సందడి చేసిన ఈయన.. మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టి సినిమాలు , షార్ట్ ఫిలిమ్స్ ,వెబ్ సిరీస్, సీరియల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2013లో వచ్చిన ‘చిన్న సినిమా’ అనే మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అర్జున్ కళ్యాణ్.. నాగచైతన్య సినిమాలో అనుపమ బాయ్ ఫ్రెండ్ గా నటించారు. ఆ తర్వాత ప్లే బ్యాక్, వరుడు కావలెను , పెళ్లికూతురు పార్టీ అనే సినిమాలో కూడా చేసిన అర్జున్.. ఉప్మా తినేసింది, లవర్ ఫరెవర్ , పరిచయం, మిస్సమ్మ, అన్ స్పోకెన్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. అంతేకాదు బీబీ జోడి అనే డ్యాన్స్ షోలో వాసంతితో కలిసి డాన్సులు ఇరగదీసి క్యూట్ పెయిర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు.

ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసిన అర్జున్ కళ్యాణ్..

తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో లో పాల్గొని పలు విషయాలను తెలిపారు. ఇకపోతే తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. గెస్ట్ గా వచ్చిన అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉండే వ్యత్యాసం, తారతమ్యాల గురించి అభిమానులతో పంచుకున్నారు..అర్జున్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలోని కొవ్వూరు ప్రాంతంలో జన్మించారు. చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి వెళ్తానని ఇంట్లో చెబితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట.. ముఖ్యంగా వేరే స్టేట్ వాళ్ళు వస్తారు రికమండేషన్ ఎక్కువ.. వారి వల్ల ఇబ్బందులు పడతావని.. ఇండస్ట్రీలో సరిగ్గా ఎంకరేజ్మెంట్ ఉండదు. తొక్కేస్తారు అని ఇంట్లో వాళ్ళు చెప్పారట. ఈ విషయంపై యాంకర్ వర్ష స్పందిస్తూ.. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇలాంటివి నిజంగానే ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఫేస్ చేశారా అని ప్రశ్నించగా? ఇలా స్పందించారు అర్జున్.

రికమండేషన్ ఉంటేనే అవకాశాలు..

Advertisement

అర్జున్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో రికమండేషన్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు ఆడిషన్స్ కి పిలిచి అంతా అయిపోయింది. ఇక ఫైనల్ గా ఓకే అనుకునే సమయంలో, ఎవరెవరో వచ్చి రికమండేషన్ పెడుతూ నా స్థానంలో వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇలా చాలానే అవకాశాలు కోల్పోయాను.అలా ఒకటి రెండు ప్రాజెక్టులలో కొంత భాగం షూటింగ్ చేసినా సరే నన్ను తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు అర్జున్.

తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా -అర్జున్

ఇక యాంకర్ వర్షా యూఎస్ఏ లో చదివి వచ్చావు కదా
. ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? యూఎస్ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించగా? అందుకు అర్జున్ తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

లవ్ ట్రాక్స్ పై అర్జున్ కళ్యాణ్ రియాక్షన్..

Advertisement

యాంకర్ వర్ష నాకు తెలిసి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా అని ప్రశ్నించగా? అందుకు అర్జున్ నాకు నిజంగానే లేదు అంటూ తెలిపారు. లవ్ ప్రోమోస్, లవ్ ట్రాక్స్ అన్ని ఏంటి అంటూ వర్ష ప్రశ్నించగా? మరి మీకు కూడా ఇలాంటివే వేస్తారు కదా! మీది కూడా నిజమేనా అంటూ ప్రశ్నించారు. అందుకు వర్ష మీది నిజమైతే నాది నిజమే అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. కానీ అర్జున్ మాత్రం మీది నిజమైతేనే నాది నిజం అంటూ తెలియజేశారు.

Related News

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×