Congress vs BRS: తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. మంత్రుల సబ్ కమిటీ.. శుక్రవారం రాత్రి ఆర్టీసీ జేఏసీ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం తెల్లవారుజామునుంచే బస్సులు రోడ్డెక్కాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు అటు ఆర్టీసీ కార్మికులు.. ఎన్నో రోజులు కొనసాగుతుందనుకున్న సమ్మె 3 రోజుల్లో ముగిసి బస్సులు రోడ్డెక్కడంతో ఇటు ప్రజలు, ప్రభుత్వం సంతోషం ఉన్నాయి. అయితే విపక్ష బీఆర్ఎస్ (BRS)కు మాత్రం సమ్మె విరమణతో నిద్రపట్టడం లేదన్న ఆరోపణలు నెట్టింట వినిపిస్తున్నాయి. మళ్లీ ENO వేసుకునే సమయం వచ్చిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మెుదలు కాగానే బీఆర్ఎస్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. ఈ సమ్మెను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ నేతలు భావించినట్లు రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సమ్మె చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు సంఘీభావం తెలియజేశారు. కార్మిక సంఘాలను కాస్త వెనక్కి నెట్టి చాలా చోట్ల ‘డౌన్ డౌన్ సీఎం’ అంటూ ఆ పార్టీ నేతలు నినాదాలు సైతం చేశారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానానికి పాల్పడటంతో.. సమ్మె మరింత ఉగ్రరూపం దాలుస్తుందని బీఆర్ఎస్ నేతలు భావించారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుడి మృతిని ప్రభుత్వ హత్యగా పేర్కొంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కార్మికులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో.. సమ్మెను మరింత తీవ్రరూపం దాల్చకుండా, విపక్షాలు దీన్ని ఆయుధంగా మలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. శంగర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూనే.. కార్మికుల్లో అసహనం, కోపం పెరిగిపోకుండా శుక్రవారం రాత్రి ఆఘమేఘాలపై మంత్రుల కమిటీని రంగంలోకి దింపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఈ బృందం భేటి అయ్యింది. జేఏసీ నేతల డిమాండ్లపై చర్చించి.. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించింది. దీంతో రాత్రికి రాత్రే.. సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో శనివారం ఉదయం నుంచే యధావిథిగా ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లోకి రావడంతో బస్సులు మళ్లీ రోడెక్కాయి.
Also Read: రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. ముందుంది ముసళ్ల పండగ.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!
అయితే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో బీఆర్ఎస్ పాలకులు వారిని సరిగ్గా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా 54 రోజుల పాటు సమ్మె కొనసాగి.. 23 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ హయాంలోనూ కార్మికులు ఆ స్థాయిలోనే సమ్మెకు దిగుతారని.. భావించిన బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక వైఖరితో తీవ్ర నిరాశే ఎదురైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానానికి పాల్పడ్డ 24 గంటల్లోనే కార్మికుల సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ నడుంబిగించడాన్ని స్వాగతిస్తున్నారు. మరోవైపు తాము ఆశించింది జరగకపోవడంతో బీఆర్ఎస్ నేతల కడుపు మండిపోతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ‘దిగులు ఎందుకు ENO ఉందిగా’ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు రాజకీయంగా పెద్ద చర్చకే తావిచ్చిందని చెప్పవచ్చు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
అయితే కడుపు మంటతో రగిలిపోతున్నార ??
దిగులు ఎందుకు
అందుకు ఉందిగా ENO pic.twitter.com/tXsVtxoeBa— Pulse of Telangana (@pulseoftelangan) April 25, 2026
Also Read: రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. ముందుంది ముసళ్ల పండగ.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!