E-Paper
Advertisement

Kirrak Couples Promo: బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది, వీళ్ల పంచులకు పడీ పడి నవ్వాల్సిందే!

Kirrak Couples Promo: బిగ్ టీవీ ‘కిర్రాక్ కపుల్స్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది, వీళ్ల పంచులకు పడీ పడి నవ్వాల్సిందే!
Advertisement

Kirrak Couples Episode 2 Promo: బిగ్ టీవీలో ప్రసారమవుతున్న ‘కిర్రాక్ కపుల్స్’ షో ఆడియెన్స్ ఓ రేంజిలో అలరిస్తోంది. గత వారం ఈ షోలో పాల్గొన్న మూడు జంటలు అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను ఫుల్ కామెడీ పంచారు. ఈ వారం మరో ముగ్గురు కపుల్స్ ప్రేక్షకులను మరింత అద్భుతంగా అలరించబోతున్నారు. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కపుల్స్ పంచ్ లు, యాంకర్లు ఆటో రాం ప్రసాద్, భ్రమరాంబిక కౌంటర్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

అదిరిపోయే స్టెప్పులతో మూడు జంటలు ఎంట్రీ

Advertisement

ప్రోమోలో వెల్ కం టు ‘కిర్రాక్ కపుల్స్’ అంటూ ఆటో రాం ప్రసాద్, భ్రమరాంబిక ఇంట్రడ్యూస్ చేస్తారు. కమెడియన్ నెల్లూరు నీరజ దంపతులు, మిమిక్రీ శాంతి కుమార్ జంటతో పాటు మానస లంక-సంతోష్ జంట అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇస్తారు. ముద్దు ముచ్చట్లు ఫన్నీ కామెంట్లతో ఆకట్టుకుంటారు. డ్యాన్స్ చేస్తుండగానే ‘నీరజా నీ మొగుడు ఎవడు? అని అడుగుతాడు ఆమె భర్త. దానికి నీరజ “సర్ నా మొగుడు ఎవరు?” అని అడుగుతుంది. “వాళ్లను అడుగుతావు.. నేను” అని చెప్తాడు. “కళ్ల జోడు పెట్టుకున్నావు కనబడలే” అని నీరజ చెప్పడంతో అందరూ నవ్వుతారు.

ముగ్గురు మహిళలకు చీరతో సారె

Advertisement

‘కిర్రాక్ కపుల్స్’ షోలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు చీర,పూలు, పండ్లతో సన్మానించారు. బిగ్ టీవీ ఇచ్చిన చీరెలు తీసుకుని కపుల్స్ ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. ఈ షోలో పాల్గొన్న కపుల్స్ లో మాసస జంటను మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అని యాంకర్ అడుగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని ఆమె భర్త సంతోష్ చెప్తాడు. శ్రీరామ నవమి రోజే తమ పెళ్లి చూపులు జరిగాయని ఆవిడ చెప్పడంతో..  “మొత్తానికి సీత కోసం రాముడు వచ్చాడు” అని యాంకర్ అనడంతో అందరూ నవ్వుతారు. వారిద్దరు కలిసి ‘కళ్లే గిల్లే సుందరాంగి’ అనే పాటకు ఇద్దరు హగ్ చేసుకుంటారు.

Also Read: బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ షో.. యాంకర్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఆకట్టుకున్న రాం ప్రసాద్, భ్రమరాంబిక కామెడీ

మానస జంట డ్యాన్స్ చూసి “నాకోసం ఎప్పుడైనా ఒక పాట పాడావా?” అంటూ ఆటో రాం ప్రసాద్ ను యాంకర్ భ్రమరాంబిక అడుగుతుంది. “ఇప్పుడు పాడనా?” అంటూ.. “ఇంత బువ్వుంటెయ్యమ్మో, ఇంత కూరుంటెయ్యమ్మో” అనడంతో అందరూ నవ్వుతారు. “నాకు ఓ పాట వస్తుందో చెప్పనా?” అంటుంది భ్రమర, “చెప్పు” అనగా “ఇక్కడ చెప్తే బాగుండదు” అంటుంది. “ఆకలేస్తే అన్నం పెడతా” లాంటి పాటలు వస్తే చెప్పు.. వెంటనే ఆయిల్ తెచ్చి మసాజ్ చేస్తా” అని రాం ప్రసాద్ అనడంతో అందరూ నవ్వుతారు.

ఇద్దరు వాయించే వాళ్లే!

“మీకు పెళ్లి చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు కదా.. వాళ్లు ఏం చేస్తున్నారు” సర్ అని మిమిక్రి శాంతి కుమార్ ను రాం ప్రసాద్ అడుతాడు. “ఒకరు తబలిస్ట్, మరొకరు ఆర్మోనిస్ట్” అని చెప్తాడు. “ఇద్దరూ వాయించే వాళ్లే” అని యాంకర్ అనడంతో అందరూ నవ్వుతారు. ఇక ఈ సందర్భంగా కపుల్స్ ఆడిన ఫన్నీ గేమ్స్ అందరినీ తెగ నవ్విస్తాయి. ప్రోమో చివరల్లో నీరజ దంపతులు కమెడియన్లుగా అవకాశాలు లేక తాము ఎదుర్కొనే కష్టాలు చెప్తూ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

Big Stories

Advertisement
×