E-Paper
Advertisement

Big tv Kissik Talks: ఆ నటుడితో జ్యోతి రెండో పెళ్లి… ఖచ్చితంగా చేసుకుంటానంటూ?

Big tv Kissik Talks: ఆ నటుడితో జ్యోతి రెండో పెళ్లి… ఖచ్చితంగా చేసుకుంటానంటూ?
Advertisement

Big tv Kissik Talks: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎంత తొందరగా పెళ్లిళ్లు చేసుకుంటారు అంతే తొందరగా విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు.. ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్లు విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఇలా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవటం సర్వసాధారణం. తాజాగా నటి జ్యోతి(Jyothi) సైతం రెండవ పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో వ్యాంప్ తరహా పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన జ్యోతి ఇటీవల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

సరైన వ్యక్తి దొరికినప్పుడు రెండో పెళ్లి..

తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు. ఈ క్రమంలోని తన రెండవ పెళ్లి(Second Marriage) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం ఈమెనటుడు శ్రీకాంత్ అయ్యంగార్(Sreekanth Iyengar) తో చాలా చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జ్యోతి స్పందించారు. శ్రీకాంత్ నాకు చాలా మంచి స్నేహితులని తెలిపారు. తన ఇంట్లో బర్త్ డే పార్టీ ఉంటే నేను కూడా ఆ పార్టీకి వెళ్లానని తెలిపారు.

శ్రీకాంత్ మంచి స్నేహితుడు..

Advertisement

ఇలా ఆ పార్టీకి వెళ్లిన తర్వాత ఆయన రాసిన ఒక సినిమా కథ గురించి తెలిపారు. నిజంగానే ఎంతో అద్భుతంగా కథ నేరేట్ చేశారని, తను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావడంతో ఆ కథ చాలా అద్భుతంగా వివరించారు. అది నాకు బాగా నచ్చితే తనని హగ్ చేసుకొని అప్రిషియేట్ చేశాను. ఆ సమయంలో ఫోటో కూడా తీసుకున్నామని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని షేర్ చేశారు. దీంతో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తలు బయటకు వచ్చాయని జ్యోతి తెలిపారు అయితే ఆ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తెలిపారు.

Advertisement

ఇకపోతే వర్ష మాట్లాడుతూ నిజంగానే మీకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉందా అంటూ ప్రశ్న వేయడంతో కచ్చితంగా చేసుకుంటానని తెలిపారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు తాను రెండో పెళ్లి చేసుకుంటానని ఈమె వెల్లడించారు. అయితే తనకు చాలామంది ప్రపోజ్ చేశారని ప్రపోజ్ చేసిన వారు తన బాధ్యతలు తెలిసి వెనకడుగు వేస్తున్నారని కూడా జ్యోతి తెలియజేశారు. ఇక తనకు వచ్చిన ప్రపోజల్ గురించి కూడా మాట్లాడుతూ.. చాలామంది నాకు ప్రపోజ్ చేయాలని ట్రై చేసేవారు కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోయారు. నేనే అర్థం చేసుకొని మేటర్ ఏంటంటూ అడగడంతో దెబ్బకు భయపడి పారిపోయే వారని తెలిపారు. ఇక జ్యోతి ఇదివరకే వివాహం చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.

Also Read: Big tv Kissik Talks: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలి..45 ఏళ్ల వయసులో ఈ కోరికేంటీ తల్లి!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×