E-Paper
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ బాస్ తరువాత సక్సెస్ రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే: దివి

Big Tv Kissik Talks: బిగ్ బాస్ తరువాత సక్సెస్ రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే: దివి
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) షో ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ దివి పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. దివి మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం వెండి తెర సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె బిగ్ బాస్ 4 కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా వర్ష బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

బిగ్ బాస్ ప్లస్ అయ్యింది..

తాను మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలో బిగ్ బాస్ అవకాశం వచ్చిందని తెలియజేశారు. నాకు ఎక్కడైనా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను కానీ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అందరితో కలిసిపోవడం, గొడవలు పడటం అనేది కాస్త ఇబ్బంది అనిపించిన ఈ రియాలిటీ షో ద్వారా మనుషులతో కలవడం నేర్చుకున్నానని తెలిపారు. ఇక బిగ్ బాస్ తర్వాత చాలామందికి కెరియర్ పరంగా ప్లస్ అవుతుంది మరికొందరికి మైనస్ గా మారుతుంది మరి మీకు బిగ్ బాస్ ప్లస్ అయ్యిందా? లేదా మైనస్ అయిందా? అనే ప్రశ్న కూడా ఎదురయింది.

ఈగోకి వెళ్లకూడదు..

Advertisement

ఈ ప్రశ్నకు దివి సమాధానం చెబుతూ.. తనకు బిగ్ బాస్ చాలా ప్లస్ అయిందని తెలిపారు. బిగ్ బాస్ షో వెళ్లి వచ్చిన తర్వాత మనకు కొంత సమయం మాత్రమే ఉంటుంది ఆ సమయాన్ని కరెక్ట్ గా మనం వాడుకుంటే సక్సెస్ అవుతామని తెలిపారు. చాలామంది బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత ఏదైనా సినిమా అవకాశం వస్తే మనం ఈగోకి వెళ్లి మేము ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాము, రెమ్యూనరేషన్ ఇలాగే ఉండాలనే కండిషన్లు పెడితే అలాంటి వారికి బిగ్ బాస్ చాలా మైనస్ అవుతుందని, ఇలాంటి విషయాలను పక్కనపెట్టి వచ్చిన అవకాశాలను వాడుకుంటే మాత్రం కచ్చితంగా బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇస్తుంది అంటూ దివి ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత దివి చిరంజీవి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలలో దివి కేవలం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పటికీ కూడా తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయని ఇంకా మంచి పాత్రల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. ఇక ఇటీవల కాలంలో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో చిన్న పాత్రలైనా సరే సినిమాలలో చేస్తున్నాను అంటూ ఈమె తన కెరీర్ గురించి తెలియజేశారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో ఈమె రిపోర్టర్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Bigtv Kissik Talks: బ్రేకప్ అవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. నా కన్నీళ్లు దిండుకు మాత్రమే తెలుసు: దివి

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×