E-Paper
Advertisement

MSVPG Collections: ఆదివారం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మన శంకర్ వరప్రసాద్.. మరో రికార్డ్ గ్యారెంటీ..!

MSVPG Collections: ఆదివారం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మన శంకర్ వరప్రసాద్.. మరో రికార్డ్ గ్యారెంటీ..!
Advertisement

MSVPG Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి సినిమా మంచి టాక్‌తో ముందుకెళ్తోంది. దాదాపు రెండు వారాలు పూర్తయినా కూడా థియేటర్లలో ప్రేక్షకుల సందడి తగ్గలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో సినిమా చూడటానికి వస్తున్నారు.

ఇప్పుడు మరో రికార్డ్..!

ఈ సినిమా ఇప్పటికే 13 రోజులు థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండో శనివారం ఒక్కరోజులోనే బుక్‌మైషోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం 1,01,000 టికెట్లు ఒకే రోజులో సేల్ కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దాదాపు రెండు వారాల తర్వాత కూడా ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చాలా అరుదైన విషయం.

Advertisement

ప్రస్తుతం బుక్‌మైషోలో గంటకు 9 వేలకుపైగా ట్రెండ్ నమోదు అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారు ₹45 కోట్ల థియేట్రికల్ లాభాలు సాధించినట్టు సమాచారం. జీఎస్టీ కలుపుకుని ఈ కలెక్షన్లు వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా ₹50 కోట్ల లాభాల క్లబ్లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక రీజినల్ సినిమాకు చాలా గొప్ప విజయం అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

రేపు కూడా జోడి తగ్గేలా లేదు..!

రేపు జాతీయ సెలవు కావడం.. అలాగే శివరాత్రి వీకెండ్ వరకు పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు మరింత కలిసివచ్చే అంశం. ఫంకీ తప్ప మరో చెప్పుకోదగిన రిలీజ్ లేకపోవడంతో.. అప్పటివరకు ఈ సినిమాకు ఫ్రీ రన్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఇంకా మంచి షేర్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. భావోద్వేగ సన్నివేశాలు, వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నయనతార నటనకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారు.
సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నియంత్రిత బడ్జెట్‌లో నిర్మించారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, ముఖ్యంగా మాస్.. పండుగ పాటలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మొత్తంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిరంజీవి కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలుస్తోంది.

ALSO READ: Suriya 50th Film: సూర్య 50వ సినిమా చుట్టూ వివాదాలే.. ఎందుకంటే..?

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×