E-Paper
Advertisement

నల్లగా ఉంది…ఇది అవసరమా.. బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఫైమా ఎమోషనల్!

నల్లగా ఉంది…ఇది అవసరమా.. బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఫైమా ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. గత ఏడాది కాలం పాటు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారికి సంబంధించిన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ కార్యక్రమానికి ఈ వారం జబర్దస్త్ ఫైమా(Jabardasth Faima) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ గురించి ఆమె పడిన ఇబ్బందుల గురించి తన పట్ల ఎదురైన అవమానాలు గురించి అభిమానులతో పంచుకున్నారు.

అందం గురించి కామెంట్లు..

ఫైమా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈమె పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జబర్దస్త్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన గురించి ఎదురైన అవమానాల గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎవరైనా నీ అందం గురించి కామెంట్ చేయడం జరిగిందా? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఫైమా సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఎందుకమ్మా నల్లగా కన్నావు..

Advertisement

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకంటూ కొంత గుర్తింపు లభించి అందరూ కూడా వుయ్ వాంట్ ఫైమా అంటుంటే కొంతమంది మాత్రం ఏముంది దీని దగ్గర?ఇంతమంది ఇలా పొగుడుతున్నారు? అందం ఎటు లేదు గలీజ్ గా ఉంది, నల్లగా ఉంది అది ఇది అంటూ చాలామంది బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని తెలిపారు. ఇలా పుట్టడంలో నా తప్పేముంది అని నేను చాలా బాధపడ్డాను. అందరూ ఇలా కామెంట్స్ చేస్తుంటే నేను అమ్మకు ఫోన్ చేశాను. ఎందుకమ్మా నన్ను ఇంత నల్లగా కన్నావు అని అడిగాను ఆ మాటలకు అమ్మ చాలా బాగా ఏడ్చిందని ఫైమా తెలిపారు.

Advertisement

సాధారణంగా తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే పుడతారు. అలాంటిది ఫైమా రంగు, రూపు రేఖలు చూసి తన పట్ల ఇలాంటి అవమానాలు చేయడంతో తనకు జరిగిన అవమానాలను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఇంకా ఎలాంటి విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి .ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఫైమా బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read: ఇది ఆరంభం మాత్రమే.. రాక పోస్టర్ పై అట్లీ ఎమోషనల్ పోస్ట్!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×