E-Paper
Advertisement

Big Tv Kissik Talks:  డెమోన్ పేరు వెనుక స్టోరీ బయట పెట్టిన పవన్… అదే ఇన్స్పిరేషనా?

Big Tv Kissik Talks:  డెమోన్ పేరు వెనుక స్టోరీ బయట పెట్టిన పవన్… అదే ఇన్స్పిరేషనా?
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఒకటి. ప్రతివారం ఈ కార్యక్రమం ప్రసారమౌతూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంది. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ డెమోన్ పవన్(Demon Pawan) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ తన ఫ్యామిలీ గురించి అలాగే బిగ్ బాస్ జర్నీ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి అలాగే తన పేరులో ఉన్న డెమోన్ గురించి కూడా ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతూ.. తాను పుట్టి పెరిగింది మొత్తం తెనాలిలో అని తెలిపారు.

ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి..

తాను ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ వచ్చానని ఇక్కడ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. ఇక తనకు ఒక అన్నయ్య ఉన్నారని అన్ని విషయాలలో తనకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. నేను బిగ్ బాస్ లో అవకాశం అందుకొని ఇక్కడి వరకు వచ్చాను అంటే తన అన్నయ్య సపోర్ట్ కారణమని తెలిపారు. ఇక తన పేరు పవన్ అయితే డెమోన్ పవన్ గా మార్చుకున్నారు అలా పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

నవలలు చదవటం చాలా ఇష్టం..

Advertisement

తనకు నావెల్స్ చదవడం అంటే చాలా ఇష్టమని. అందులో క్యారెక్టర్స్ ను నేను ఇన్స్పైర్ చేసి వాళ్ళ లాగా వీక్ నుంచి స్ట్రాంగ్ అవ్వటానికి , నా లైఫ్ లో ఇంకా బెటర్ అవ్వటానికి ఈ పేరు పెట్టుకున్నాను అంటూ డెమోన్ అనే పేరు వెనుక గల కారణాన్ని తెలియజేశారు. తనని ఇన్స్పిరేషన్ చేసుకుంటూ జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ఇలాంటి పేరు పెట్టుకున్నారనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న డెమోన్ ఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా బిగ్ బాస్ సీజన్ 9 కామన్ క్యాటగిరిలో భాగంగా కామన్ మ్యాన్ కి అవకాశం కల్పించడంతో డెమోన్ అగ్నిపరీక్షకు ఎంపిక అయ్యి అక్కడ కూడా టాస్కులలో గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన కామన్ మ్యాన్ క్యాటగిరిలో వెళ్లినప్పటికీ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి మరి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి డెమోన్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 9 ద్వారా మంచి సక్సెస్ అందుకున్న డెమోన్ ప్రస్తుతం బీబీ జోడి సీజన్ 2 కార్యక్రమంలో రీతుతో కలిసి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

Also Read: SSR 61: 90 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టనున్న సింగీతం శ్రీనివాస్..

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×