E-Paper
Advertisement

Big tv kissik Talks:  నాగబాబు సాయం మర్చిపోలేను.. కష్ట సమయంలో అండగా!

Big tv kissik Talks:  నాగబాబు సాయం మర్చిపోలేను.. కష్ట సమయంలో అండగా!
Advertisement

Big tv kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియాంక సింగ్ పాల్గొని సందడి చేశారు.. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రియాంక సింగ్ అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పూర్తిగా బుల్లితెరకు వెండితెరకు కూడా దూరమయ్యారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

బిగ్ బాస్ అవకాశం అలా వచ్చింది..

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. జబర్దస్త్ కార్యక్రమం నుంచి తనను ఉద్దేశపూర్వకంగానే బయటకు పంపించారని తెలిపారు. ఇలా ఉన్నఫలంగా తనని బయటకు పంపించడంతో తనకు పెద్దగా అవకాశాలు కూడా లేకుండా పోయాయని తెలిపారు. ఆ సమయంలోనే నాగబాబు(Nagababu)గారు తనకు ఇతర చానల్స్ లో పలు షోలలో అవకాశం కల్పించారని ఈమె తెలియజేశారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మా లో ఒక షోలో చేస్తున్నాను అదే సమయంలోనే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందని తెలిపారు. అలా బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లానని ప్రియాంక తెలియచేశారు.

నా ఖర్చులన్నీ నాగబాబు గారే భరించారు..

Advertisement

ఇక నాగబాబు తనకు వ్యక్తిగతంగా కూడా చాలా సహాయం చేశారని తెలిపారు. సర్జరీ సమయంలో ఖర్చులకు కొంత డబ్బులు పంపించడమే కాకుండా మందులకు అయ్యే ఖర్చులన్నీ కూడా నాగబాబు గారే పెట్టుకున్నారని ఆ సమయంలో నాకు చాలా అండగా నిలిచారని, నాగబాబు గారు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక సింగ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నాగబాబు జబర్దస్త్ జడ్జిగా కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రారంభం సమయంలో ఈయన జడ్జిగా ఉన్నారు దీంతో జబర్దస్త్ కమెడియన్లకు నాగబాబు అంటే ఎంతో అమితమైన గౌరవం ఉండేది.

Advertisement

నాగబాబు కూడా జబర్దస్త్ షోలో పనిచేసిన వారికి ఏదైనా ఆపద వస్తే నేనున్నాను అంటూ వారికి అండగా నిలుస్తుంటారు. ఎంతోమందికి నాగబాబు ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఇక ప్రియాంక సింగర్ సైతం నాగబాబు గారు చేసిన సహాయం గురించి ఈ సందర్భంగా తెలియచేయడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ప్రియాంక సింగ్ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే తనకు అవకాశాలు లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఏదైనా మంచి అవకాశం వస్తే తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ తెలియజేశారు.

Also Read: Big tv kissik Talks: జబర్దస్త్ నుంచి వెళ్ళలేదు.. వెళ్లగొట్టారు అసలు విషయం చెప్పిన ప్రియాంక!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×