నిత్యం వివాదాలు పనితీరులో అలక్ష్యం .. నిర్వహిస్తున్న శాఖలోపై కనిపించని పట్టు…. నియోజకవర్గంలో వర్గ విభేదాలు….అధికారులపై నిత్యం ఆగ్రహావేశాలు, అసంతృప్తులు… ఇన్ని డ్రాబ్యాక్స్‌తో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అనునిత్యం నెగిటివ్ పబ్లిసిటీ ఎదుర్కొంటున్నారు. మొదటిసారిగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే అదృష్టం కలిసొచ్చి మంత్రి అయ్యారు కాని ఆ పదవికి సార్థకత చేకూర్చలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వైఖరితో వివాదాలకు కేంద్రమవుతున్న ఆ రాయలసీమ మంత్రి సీఎం చంద్రబాబు కంటే బిజీ అయిపోతున్నారన్న సెటైర్లు పెరిగిపోతున్నాయి.. అసలు ఆ అమాత్యుడిపై అంత నెగిటివ్ పెరగడానికి కారణమేంటి?
రాయలసీమ తెలుగుదేశం పార్టీకి పట్టులేని ప్రాంతం… అందులోనూ ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే పెద్దగా పట్టించుకోని పరిస్థితి… అటువంటి రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లో టిడిపి తరఫున పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొందారు రామ్‌ప్రసాద్ రెడ్డి. గెలవడమే కాదు అదృష్టం కలిసొచ్చి సామాజిక సమీకరణ ఈక్వేషన్లతో మంత్రి కూడా అయ్యారు. మంత్రి ఆయన మరుక్షణం నుంచే వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తుందట. ఈ మధ్య వివాదాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరుల్లో ఆ మంత్రి పేరు ముందు ఉంటోందంట.
గెలిచిన కొత్తల్లో పోలీస్ అధికారులపై ఆయన సతీమణి ఆగ్రహం వ్యక్తం చేయడం… రోడ్డుపైన పంచాయితీ వీడియో వైరల్ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారంలో మంత్రి పేరు సోషల్ మీడియాల్లో చెక్కర్లు కోట్టింది. కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డికి సపోర్ట్ చేశారని …జయ చంద్రారెడ్డిని విదేశాల్లో దాచిపెట్టి కాపాడారనే చర్చ జోరుగా నడించింది. నకిలీ మద్యం కేసు విచారణ జరుగుతున్న క్రమంలో చిత్తూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉండడంతో రామ్‌ప్రసాద్ రెడ్డిపై రాజకీయంగా రచ్చ రేపింది.
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. రాంప్రసాద్‌రెడ్డి తండ్రి మండిపల్లె నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాంప్రసాద్‌రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్టును ఆశించారు. అయితే అప్పట్లో టికెట్టు రాలేదు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత అధికార పార్టీలో ఇమడలేక ఇంకా మూడు సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు.
రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో టికెట్ల విషయమై గట్టి పోటీ ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో టికెట్టు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో టీడీపీ జెండా ఎగురవేసి రికార్డు సృష్టించారు. అయితే మంత్రి గా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాలు గడిచిన నేటికీ ఆ శాఖపై ఏమాత్రం కూడా పట్టు సంపాదించలేకపోయారనే టాక్ ఉంది. మంత్రుల పనితీరు ఆధారంగా వారికి సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ నెలఖారు వరకు.. మంత్రుల వద్దకు వచ్చిన దస్త్రాలను క్లియర్ చేయడం ఆధారంగా వారికి ర్యాంకులు ఇచ్చారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి చివరి మూడు స్థానాల్లో ఉన్న పరిస్థితి. చివరి నుంచి మూడు నాలుగు స్థానాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.. మొత్తం 669 ఫైల్స్ గాను.. ఒక్కో ఫైలు సగటున 15 రోజుల 19 గంటల 53 నిమిషాలు తీసుకున్నారు..దస్త్రాల పరిష్కారంలో జాప్యంపై అందర్నీ ఒకే గాటన కట్టడం సరికాదని… విజిలెన్స్, ఏసీబీ వంటి కేసుల ఉపసంహరణ కోసం వచ్చిన దస్త్రాలు ఎక్కువగా ఉండటంతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దగ్గర జాప్యం జరిగిందని కాటమనేని భాస్కర్ తెలిపారు. మంత్రులు కొల్లు రవీంద్ర, మనోహర్ వద్ద కూడా అలాంటి కేసుల దస్త్రాలే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, ఆర్థిక మంత్రి కేశవ్ దగ్గర నిధుల కోసం వచ్చిన విజ్ఞ పుల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. దానిపై సీఎం స్పందిస్తూ రాంప్రసాద్ రెడ్డికి నాకొచ్చే వాటికంటే సెన్సిటివ్ ఫైల్స్ వస్తాయా? కారణం ఏదైనా దస్త్రాల పరిష్కారానికి 15 రోజులు తీసుకోవడం సరికాదు. ఇకపై సాకులు చెబితే ఊరుకోనని హెచ్చరించారు.
మంత్రి ఫైల్స్ క్లియర్ చేయడం విషయంలో అలసత్వం హహిస్తున్నారనే చర్చ నడుస్తున్న క్రమంలోనే…శాఖపైన పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారనే చర్చ హాట్ టాపిక్ మారిందట. మంత్రుల తీరు పట్ల సీఎం చంద్రబాబు తరచు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది… మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండు మూడుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.. మరోవైపు లోకేష్ టీంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారనే చర్చ నడుస్తుంది…అందుకే ఏమైనా లోకేష్ చూసుకుంటారని ధీమాతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట.
Story By Ajay, Big Tv