E-Paper
Advertisement

Big Tv Kissik Talks: మొహం మీదే చీదరింపులు.. అవమానాలు…పల్సర్ బైక్ రమణ ఎమోషనల్!

Big Tv Kissik Talks: మొహం మీదే చీదరింపులు..  అవమానాలు…పల్సర్ బైక్ రమణ ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks : బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ వారం కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా యూట్యూబ్, జానపద గేయం గాయకుడు రమణ హాజరయ్యారు. రమణ అంటే బహుశా గుర్తుపట్టకపోవచ్చు కానీ పల్సర్ బైక్ రమణ అంటే మాత్రం అందరికీ గుర్తుకు వస్తారు. పల్సర్ బైక్ అనే పాట ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రమణ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. తన భార్య కుందనతో కలిసి ఈయన యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోవడం అంటే ఎంతో కష్టతరమైన విషయం అని చెప్పాలి.

డ్రైవర్ గా పనిచేసిన రమణ..

ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు అలాంటి కోవాకు చెందిన వారే పల్సర్ బైక్ రమణ. ఇండస్ట్రీలోకి రాకముందు ఒక డ్రైవర్ గా పనిచేస్తుండేవాడినని తెలిపారు. అయితే పాటలపై ఆసక్తితో జానపద గాయకుడిగా మారడమే కాకుండా యూట్యూబ్ వీడియోలతో సక్సెస్ అందుకొని కెరీయర్ లో బిజీగా ఉన్నారు. తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరియర్ లో ఎదుర్కొన్న అవమానాలు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

కెరియర్ లో ఎన్నో అవమానాలు..

Advertisement

తనకు బ్రేక్ రావడానికి సుమారు 6 సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు .ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. చాలామంది మొహం మీదే చీదరించుకున్నారని అయినప్పటికీ ఈ అవమానాలను భరిస్తూ ముందడుగు వేశానని రమణ తెలిపారు. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా సక్సెస్ అందుకోవడం వెనుక ఎన్నో అవమానాలు ఎంతో కష్టం దాగి ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రమణ తన భార్య గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి తెలిపారు. ఇక తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి కూడా తెలియజేశారు. ఇక సోషల్ మీడియా గురించి కూడా రమణ కు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Advertisement

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అమ్మాయిలు సమస్యలలో చిక్కుకుంటున్నారని తెలిపారు. తాను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా తనతో ఒక వ్యక్తి మాట్లాడుతూ తనకు 14 నెలల పాప ఉంది తన భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడం కోసం తనని వదిలేస్తానంటోంది అంటూ తెలిపారు. ఇలా రీల్స్ పిచ్చితో చాలామంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడారు . ఇక ఈ కార్యక్రమంలో ఈయన ఇంకా ఎలాంటి విషయాల గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ పెద్ద శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.

Also Read: Big Tv Kissik Talks: అమ్మ కోసమే బ్రతికాను… పల్సర్ బైక్ రమణ బ్రేకప్ లవ్ స్టోరీ..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×