E-Paper
Advertisement

Modi Watch: ఏఐ సదస్సులో ప్రధాని చేతికి బాగ్ వాచ్.. ధర తెలిస్తే షాక్!

Modi Watch: ఏఐ సదస్సులో ప్రధాని చేతికి బాగ్ వాచ్.. ధర తెలిస్తే షాక్!
Advertisement

Modi Watch: దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అల్గోరిథంలు, ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీలపై ఈ సదస్సులో చరిస్తున్నారు. ప్రధాని మోదీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికపైకి అడుగుపెట్టగానే.. ప్రపంచ ఏఐ సాంకేతిక అభివృద్ధికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అర్థమైంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ ధరించిన బాగ్ వాచ్ పై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. మెషిన్ లెర్నింగ్, డిజిటల్ టెక్నాలజీపై చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఈ వాచ్ ఉద్దేశపూర్వక శైలిని ప్రకటనలా అనిపించిందని నెటిజన్లు అంటున్నారు.

జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన గౌరవ్ మెహతా తయారు చేసిన బాగ్ కేవలం సాదాసీదా వాచ్ కాదు. ఇది దేశ చరిత్రను ప్రతిబంధిస్తుంది. ఈ వాచ్ లోపలి భాగంలో స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947 నాణెంను కలిగి ఉంది. దీంతో ఇది వారసత్వానికి కేంద్రంగా నిలుస్తుంది.

ప్రధాని మోదీ ధరించిన బాగ్ వాచ్ ధర ఎంత?

Advertisement

ప్రధాని మోదీ ధరించిన బాగ్ వాచ్ ధర సుమారు రూ55,000. లగ్జరీ టైమ్‌పీస్‌లు సాధారణంగా లక్షలు, కోట్లకు ఉంటాయి. ఏఐ టెక్నాలజీ సదస్సులో స్వదేశీ తయారీ వాచ్ ను ధరించిన మోదీ.. స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధికి సంకేతంగా దీనిని ధరించారనే చర్చ జరుగుతోంది. ఈ వాచ్ డయల్ పై బాగ్ (పులి) బొమ్మ ఉంటుంది. దేశం బలం, సార్వభౌమాధికారం, వేగాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ప్రపంచంతో పోటీ, సాంకేతిక నాయకత్వంపై చర్చలు జరుగుతున్న ఆల్-టెక్ AI సమ్మిట్ నేపథ్యంలో.. పులి డిజైన్ ఉన్న వాచ్ ను పెట్టుకున్న ప్రధాని స్వదేశీ సందేశం లాగా అనిపించిందని నెటిజన్లు అంటున్నారు.

ఇప్పుడే ఎందుకు?

ప్రధాన మంత్రి గతంలోనూ బాగ్ వాచ్ ను ధరించారు. కానీ దానిని భిన్నంగా పెట్టుకున్నారు. భవిష్యత్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సుకు అంకితమైన ఈవెంట్ లో చారిత్ర గడియారాన్ని పెట్టుకోవడం వెనుక వారసత్వం సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల కాలంలో లగ్జరీ వస్తువుల కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తున్నారు. బాగ్ లాంటి వాచ్ లో ఇటు దేశీయ అభిరుచితో పాటు సాంకేతిక తోడైంది. జైపూర్ వాచ్ కంపెనీ వంటి బ్రాండ్‌లు క్రాఫ్ట్ పునరుజ్జీవనానికి సహాయపడుతుంది.

Advertisement

Also Read:   ఏఐ రంగంలో రిలయన్స్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. రానున్న ఏడేళ్లలో!

ఈ వాచ్ లో 316L స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడిన 43 mm స్టేట్‌మెంట్. ఈ వాచ్ లో పులి చిత్రంతో పాటు 1947 రూపాయి నాణెంను ఉంటుంది. రూ.55,000 ధరకు లభించే ఈ లగ్జరీ వాచ్ కేవలం టైమ్‌పీస్ మాత్రమే కాదు, భారతీయ వారసత్వానికి చిహ్నం.

Tags

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×