E-Paper
Advertisement

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై సోనియా ఎమోషనల్ … చాలా అన్నారు.. కానీ?

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై సోనియా ఎమోషనల్ … చాలా అన్నారు.. కానీ?
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కరోనా, ఆశ, ఆర్టిస్ట్ వంటి తదితర సినిమాలలో హీరోయిన్ గా  నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనియా ఆకుల అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. సోనియా గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా పెళ్లి పిల్లలు అంటూ సోనియా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త యశ్ వీరగోని అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

బాడీ షేమింగ్ ట్రోల్స్..

యశ్ పలు వ్యాపారాలను కొనసాగిస్తూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా సోనియా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష తన వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే గత కొద్ది రోజులుగా సోనియా శరీర ఆకృతి పట్ల వస్తున్నటువంటి విమర్శలు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.పెళ్లి తర్వాత పాప జన్మించడంతో సోనియా గుర్తుపట్టలేనంత విధంగా అధిక శరీర బరువు పెరిగిపోయారు.

ఏడాది పాటు బ్రెస్ట్ ఫీడింగ్..

Advertisement

ఇలా చాలామంది ఇతరులను బాడీ షేమింగ్  కామెంట్స్ చేస్తూ కించపరుస్తూ ఉంటారు. వాళ్లకు మీరేం చెప్తారు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సోనియా సమాధానం చెబుతూ నేను ఇలాంటి ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే తాను అందం కంటే తన బిడ్డ ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు తనకు తల్లిపాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే అధిక శరీర బరువు పెరిగిపోతున్నానని ఈమె తెలిపారు.. అయితే తాను అనుకుంటే వర్క్ అవుట్ చేసి తిరిగి కొద్ది నెలలలోనే సాధారణ స్థితికి రాగలను. అందుకే ముందు తన బిడ్డ ఆరోగ్యాన్ని మాత్రమే తను దృష్టిలో పెట్టుకున్నాను అంటూ సోనియా తన పట్ల బాడీ షేమింగ్ చేసిన వారికి తనదైన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు.

Advertisement

ఇలా తన పట్ల వచ్చిన విమర్శల గురించి సోనియా తన సమాధానం చెప్పడంతో ఈమె మాటలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇటీవల కాలంలో హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తమ అందం పాడవుతుందని తమకు అవకాశాలు రావని చాలామంది పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. ఒకవేళ పిల్లలు పుడితే వారికి తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టపడరు కానీ సోనియా మాత్రం తన బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈమె నిర్ణయం పట్ల అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: సోనియా ఆకుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా… తెలిస్తే మతి పోవాల్సిందే!

Related News

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Big Stories

Advertisement
×