Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల(Sonia Akula) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. ముఖ్యంగా తన భర్త యష్ (Yash)వ్యాపారాల గురించి కూడా తెలిపారు. ఇప్పటికే ఏడు కంపెనీలకు యశ్ సీఈఓ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. పెళ్లికి ముందు వరకు సినిమాలలో పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న సోనియా పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు.
ఇక ప్రస్తుతం ఈ దంపతులకు ఒక చిన్నారి జన్మించడంతో ఈమె పూర్తిగా పాప ఆలన పాలన, వారి వ్యాపారాలను చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొనడంతో యాంకర్ వర్ష సోనియాను ప్రశ్నిస్తూ ఆస్తుల గురించి అడిగారు. ఎన్నో వ్యాపారాలను చేస్తున్న సోనియాకు ఎంత ఆస్తి ఉంది అంటూ ప్రశ్న వేయడంతో ఈమె సమాధానం చెబుతూ..తాను చాలా హ్యాపీగా బతికే అంత ఆస్తుంది. నాకు చాలా మంచి భర్త దొరకాడు. నేనేం చేస్తానన్న తనకు సపోర్ట్ చేస్తాడు. అలాగే తన కూతురు మహాలక్ష్మి రూపంలో మా ఇంటికి వచ్చిందని తెలిపారు. ఇక ఎప్పుడు కూడా మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ,ఎంత బంగారం ఉందనే విషయాల గురించి మేము ఆలోచించలేదని ఆ విషయాల గురించి మాట్లాడమని తెలిపారు..
నేను యష్ ఎప్పుడు కూడా ఈ ఏడాది మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము, వాటిలో ఎంత సక్సెస్ అయ్యాము, వచ్చే ఏడాది ఇంకెన్ని ప్రాజెక్ట్స్ చేయగలము అనే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తామని తెలిపారు. ఏదైనా వ్యాపారాలలో లాభాలు వస్తే వెంటనే వెళ్లి ఆస్తులు కొనాలనే ఆలోచన మాకు లేదు. మా వెనుక ఆస్తులు సంపాదించుకోవడం కంటే కూడా మాకు మా వెనుక మనుషులను సంపాదించుకోవడం ముఖ్యమని సోనియా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాము పలు వ్యాపారాలు ద్వారా సుమారు 300 మందికి అన్నం పెట్టగలుగుతున్నాము భగవంతుడి దయవల్ల ఆ 300 మంది 3000 అవ్వాలన్నదే నా కోరిక అంటూ ఈమె తెలిపారు.
ఇలా తన ఆస్తులు గురించి అడగడంతో ఆస్తులు విలువ ఎంత అనే విషయాన్ని సోనియా చెప్పకపోయినప్పటికీ ఆస్తుల కంటే కూడా మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఈమె తెలిపారు. ఇక ప్రస్తుతం సోనియా భర్త యశ్ ఏకంగా ఏడు కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్నారు. ఈ వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఉంటారని తెలుస్తోంది. ఇక సోనియా సైతం ఒక వైపు తన భర్త వ్యాపారాలను చూసుకుంటూనే మరోవైపు ఎన్జీవోల ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వీరికి శిఖ అనే అమ్మాయి జన్మించడంతో ప్రస్తుతం సోనియా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
Also Read: బిగ్ బాస్ పై సోనియా షాకింగ్ కామెంట్స్..గుర్తింపు రాలేదు అంటూ!