E-Paper
Advertisement

Big Tv Kissik Talks: తమిళ ఇండస్ట్రీ నన్ను వాడుకోలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!

Big Tv Kissik Talks: తమిళ ఇండస్ట్రీ నన్ను వాడుకోలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఒకప్పుడు కేవలం ఆ భాషకు సంబంధించిన సెలెబ్రెటీలను మాత్రమే సినిమాలలో తీసుకునేవారు కానీ ఇటీవల కాలంలో ఒక భాషలో సినిమా వస్తుంది అంటే ఆ భాషకు సంబంధించిన వారి కంటే కూడా ఇతర భాషలకు సంబంధించిన సెలబ్రిటీలే అధికమవుతున్నారు. ఈ విషయం గురించి తరచూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా పక్క రాష్ట్రాల వాళ్ళు సెలబ్రిటీలుగా సక్సెస్ అందుకుంటున్నారు కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం హీరోయిన్లుగా ఛాన్స్ ఇవ్వలేదు.

తమిళంలో నాకు అవకాశాలు ఇవ్వలేదు..

ఇలా మన సొంత భాషలో ఛాన్సులు రాకపోవడం గురించి ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు సైతం ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం చెబుతూ.. ఈ సమస్య ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రతి ఒక్క చోట ఉంటుందని తెలిపారు. ఇప్పుడు నేను తమిళ అమ్మాయిని కానీ తమిళ చిత్ర పరిశ్రమ నన్ను తీసుకోలేదు అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. నేను చిన్నప్పటినుంచి తమిళ ఇండస్ట్రీలోనే పెరిగాను అక్కడ ఎవరు నన్ను వాడుకోలేదు ఏదో ఒక నాలుగు ఐదు సినిమాలలో మాత్రమే తీసుకున్నారని తెలిపారు.

భాష కాదు.. టాలెంట్ ముఖ్యం..

Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలో నా టాలెంట్ ఎవరు వాడుకోలేదు.. అందుకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ నా టాలెంట్ అందరూ వాడుకుంటున్నారు. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు, నా సినిమాలను ఆదరిస్తున్నారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఇక్కడ ముఖ్యం కాదని, మనలో ఎంత టాలెంట్ ఉందనేది మాత్రమే చూస్తారని వరలక్ష్మి తెలిపారు. ఒక యాక్టర్ ఓకే భాషకు పరిమితం కాకూడదని ఏ భాషలో అయినా చేయొచ్చని తెలిపారు. ఏదైనా ఒక పాత్రకు కమిట్ అయ్యాము అంటే ఆ పాత్రలో మనం ఒదిగిపోవాలని తెలిపారు. ఇలా తెలుగువాళ్లు కాకుండా పక్కన వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ మాట్లాడిన మాటల వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్న కూడా ఎదురయింది.

Advertisement

ఈ ప్రశ్నకు వరలక్ష్మికి సమాధానం చెబుతూ ఇలాంటి విషయాల గురించి తాను అసలు ఏ మాత్రం పట్టించుకోనని తెలిపారు. నేను ఒక సినిమా చేస్తున్నాను అంటే ఆ సినిమాకు 200% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను సినిమా హిట్ అయిన ఫ్లాపైన ఒకే విధంగానే రిసీవ్ చేసుకుంటానని తెలిపారు. ఎప్పుడైనా తమిళంలో ఎందుకు సక్సెస్ కాలేకపోయాననే ప్రశ్న వేసుకున్నారా అంటూ వర్ష మరో ప్రశ్న వేయడంతో అలా ప్రతిసారి ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే అక్కడే మన జీవితం ఆగిపోతుందని ఈమె తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.

Also Read: Big Tv Kissik Talks: అమ్మాయిల పై వేధింపులు… కో** పడేయాలన్న వరలక్ష్మి!

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×