E-Paper
Advertisement

Electric Vehicles: పెట్రోల్ ధరలు భగభగ.. ఇప్పుడు ఈవీ కార్లను కొనేయడమా బెటరా? ముందుగా ఇది తెలుసుకోండి

Electric Vehicles: పెట్రోల్ ధరలు భగభగ.. ఇప్పుడు ఈవీ కార్లను కొనేయడమా బెటరా? ముందుగా ఇది తెలుసుకోండి
Advertisement

Electric Vehicles: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రభావం చమురు సరఫరా పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల్లో పెరుగుతుండడంతో.. ఎలక్ట్రిక్ వాహనాలు (EV) కొనుగోలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు దీర్ఘకాలిక ఖర్చులను అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయంతో భారతదేశం వంటి దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.

మిడిల్ ఈస్ట్ సంక్షోభం

ప్రపంచ చమురు సరఫరాలో మిడిల్ ఈస్ట్ కీలకంగా ఉంది. ఈ ప్రాంతంలో రాజకీయ అస్థిరతతో ముడి చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురులో గణనీయమైన రవాణా వాటా కలిగి ఉంది. ఈ మార్గంలో చమురు నౌకల రవాణాకు ఏదైనా అంతరాయం ఏర్పడితే చమురు సరఫరాపై ప్రభావం పడి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.

Advertisement

భారత్ తన ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. యుద్ధం ఇంకా కొనసాగి ముడి చమురు ధరలు పెరిగితే, రానున్న రోజుల్లో దేశంలో ఇంధన ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో కొంతమంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారు. ఇటీవల ఈవీల సేల్స్ పెరుగుతున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు

ఈవీల సేల్స్ పెరగడానికి పెట్రోల్ ధరలు ఒక కారణమని నిపుణులు అంటున్నారు. పెట్రోల్ వెహికల్స్, EVల మధ్య ప్రధాన తేడాలలో నిర్వహణ ఖర్చులు ఒకటి. పెట్రోల్, డీజిల్ కార్లు.. ప్రపంచ మార్కెట్లు, పన్నులు, నిర్వహణ ఖర్చులు, ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు విద్యుత్తుతో పనిచేస్తాయి. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. ఈవీలు కిలోమీటరుకు తక్కువ ఖర్చు అవుతుంది. ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఈవీలకు కొన్ని సమస్యలున్నాయి. బ్యాటరీ ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా పెట్రోల్ మోడళ్ల కంటే కాస్త ఎక్కువ ధరలు ఉంటాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో కాస్త ధరలు తగ్గుతాయి.

ఛార్జింగ్ సదుపాయాలు

Advertisement

దేశంలో పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. పెద్ద నగరాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు వేగంగా పెరుగుతున్నాయి. అయితే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఛార్జింగ్ పాయింట్ల తక్కువే. చాలా మంది యజమానులకు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. ఆధునిక ఈవీలు సాధారణంగా ఒకే ఛార్జ్‌పై 300- 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రణాళిక అవసరం ఛార్జింట్ పాయింట్లు ఉన్న రూట్లను ఎంచుకోవాలి. పెట్రోల్ కార్లతో ఈ సమస్య ఉండదు. నిర్వహణ పరంగా చూస్తే ఈవీలు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంజిన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్‌లు వంటి ఈవీలలో ఉండవు. కానీ లాంగ్ టర్మ్ లో బ్యాటరీ లైఫ్, ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

Also Read:  పెట్రోల్ బంకులతో పనిలేదు.. కిలోమీటరుకు కేవలం రూ.2.50 ఖర్చుతో రాజాలా తిరగండి!

తక్కువ ధరలు, ఫ్యూయలింగ్ నెట్‌వర్క్ కారణంగా పెట్రోల్ వాహనాలను భారత్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, చమురు సరఫరా అంతరాయాలతో కొనుగోలుదారుల ఈవీలపై చూస్తున్నారు. దేశంలో ఈవీల ఛార్జింగ్ పాయింట్ నెట్ వర్క్ లు పెరిగితే సేల్స్ మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×