E-Paper
Advertisement

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!
Advertisement

Bigg Boss 10 :బిగ్ బాస్ 10 తెలుగు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన టాస్క్ లతో పాటు కనీ వినీ ఎరుగని రీతిలో కామెడీని కూడా పంచుతోంది. ముఖ్యంగా జబర్దస్త్ నుండి హౌస్ లోకి అడుగుపెట్టిన రాంప్రసాద్ , నరేష్ ఎప్పటికప్పుడు తమ కామెడీతో హౌస్ లో హీట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నామినేషన్ వేడి , కంటెండర్ షిప్ కోసం గొడవలు అన్నీ జరిగిపోయాయి. అయితే తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమోలో నరేష్ పండించిన అల్లరి, దక్ష తన భార్య అని చెప్పడం, అటు దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోకి హైలెట్గా నిలిచాయి. మరి అసలు ప్రోమో ఏంటో ఇప్పుడు చూద్దాం.

దక్ష నే నా భార్య – నరేష్

బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వెంటనే ముకేష్ అంటే తనకు చాలా ఇష్టమని, కాకపోతే ముకేష్ తనను పట్టించుకోవడం లేదు అంటూ హోస్ట్ నాగార్జున ముందే దేబ్జానీ తన అభిప్రాయాలను చెప్పిన విషయం తెలిసిందే. కానీ ముఖేష్ – వర్షినిల మధ్య లవ్ ట్రాక్ ఇటు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది..ఇక దీంతో దేబ్జానీ, నరేష్ మధ్య సరదా లవ్ ట్రాక్ ఆడియన్స్ కి క్యూట్ గా అనిపిస్తోంది. ఇక నిన్న, మొన్నటి వరకు తన గర్ల్ ఫ్రెండ్ అంటూ నరేష్.. దేబ్జానీ గురించి పెద్దగా చెప్పుకొని తిరిగాడు. కానీ ఇప్పుడు దక్ష రాగానే దక్ష నే తన భార్య అంటూ ఏకంగా ఆమెకు పసుపు కూడా పెట్టేశాడు.

కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ..

Advertisement

39వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మొదటి ప్రోమోలో.. దక్ష నరేష్ తో పసుపు పెట్టు అని అడుగుతుంది. నరేష్ ముహూర్తం బాలేదు తర్వాత పెడతాను అంటే.. పర్వాలేదు అని త్రిగుణ్ తో పాటు మిగతా హౌస్ మేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. అలా ఎట్టకేలకు చేతితో పాటు ఆమె నుదుటున పసుపు పెట్టేస్తాడు నరేష్. అయితే దేబ్జాని మాత్రం పసుపు పెడతావా నువ్వు.. ఇన్ని రోజులు నాతో లవ్ ట్రాక్ నడిపి, కొత్త వాళ్ళు రాగానే నన్ను దూరం పెడతావా? అంటూ సీరియల్ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆక్ట్ చేసింది.

also read:అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ.. తెలంగాణ పల్లెటూరి అమ్మాయి ఆకట్టుకుందా?

నవ్వులు పూయిస్తున్న ప్రోమో..

Advertisement

ఇక నరేష్ తో రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. అదృష్టం అంటే నీదే.. ఒకరు వైఫ్ , మరొకరు లవర్ అంటూ అందరినీ నవ్వించారు. బందరు లడ్డు కావాలా? రసగుల్లా కావాలా? అంటూ త్రిగుణ్ అడగడం, తనకు బందర్ లడ్డు కావాలి అని దక్ష చేయి పట్టుకోవడం అన్నీ సరదాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికైతే ఎప్పుడు ఫ్రస్టేషన్తో గొడవలతో హౌస్ మొత్తం హీట్ మీద ఉండే ఈ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ మధ్య సరదా నవ్వులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో మాత్రం ఆడియన్స్ ను బాగా నవ్విస్తోంది.

 

Related News

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

బాధ్యత ఉండక్కర్లేదా.. ‘అలయన్స్ ఎయిర్ లైన్స్’ పై యాంకర్ గాయత్రి అసహనం..వీడియో వైరల్!

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Big Stories

Advertisement
×