E-Paper
Advertisement

హీరో విజయ్ కి బిగ్ షాక్.. ఓటెయ్యొద్దు అంటూ ధర్నా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

హీరో విజయ్ కి బిగ్ షాక్.. ఓటెయ్యొద్దు అంటూ ధర్నా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Vijay Thalapathy: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathy)ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. త్వరలో అనగా ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తన సొంత పార్టీ టీవీకే(TVK ) ద్వారా బరిలోకి దిగుతున్నారు. డీఎంకే కూటమి, ఎన్ డి ఏ కూటమితో పాటు ఈసారి తమిళ స్టార్ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడు.. దీంతో తమిళనాడులో పోటీ హోరా హోరీగా జరగనుంది. అయితే తమిళనాడు ఎన్నికల హడావిడి మొదలైన దగ్గరి నుంచి విజయ్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తాజాగా ఒక నటి విజయ్ కి భారీ షాక్ ఇచ్చింది.

విజయ్ కి ఓటు వేయొద్దు – పబ్లిక్ లో ప్రముఖ నటి ప్రచారం..

కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకులు విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా ఓటెయ్యొద్దు అంటూ చేస్తున్న ప్రచారం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఎవరో కాదు మరియా జులియానా (Maria Juliana).. ఈమె ఒక తమిళ్ నటి. పలు సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ తమిళ్లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.

మహిళలకు రక్షణ లేదంటూ..

Advertisement

అలాంటి ఈమె డీఎంకే పార్టీలో చేరి గతంలోనే పార్టీ కార్యకర్తగా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు విజయ్ కి వ్యతిరేకంగా టీవీకే పార్టీకి ఎవరు ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తూ ఫ్లకార్డ్ లు పట్టుకొని జనాలలో తిరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో విజయ్ గురించి నెగటివ్ ప్రచారం చేస్తున్న ఈమె ఒక మెట్టు ముందడుగు వేసి చెన్నై మెరీనా బీచ్ వద్ద రెండు ఫ్లకార్డులను పట్టుకొని ధర్నా చేసింది. తన మద్దతుదారులతో కలిసి సడన్ గా ప్రత్యక్షమై ఈ ధర్నా నిర్వహించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి.. ఒక ఫ్లకార్డులో టీవీకే పార్టీలో మహిళలకు రక్షణ లేదు. అందుకే మీరు ఎవరూ కూడా విజయ్ కి ఓటు వేయొద్దు అని రాయిగా.. మరొక దాంట్లో డీఎంకే కి ఓటు వేయండి అంటూ అలా రెండు ఫ్లకార్డ్ లను పట్టుకొని తిరిగింది. దీంతో విజయ్ అభిమానులు మరియా జులియానా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Alia Bhatt: ఘనంగా అలియా భట్ సోదరి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే?

రంగంలోకి పోలీసులు..

Advertisement

పోలీసులకు ఈ విషయం తెలియడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎవరి పర్మిషన్ లేకుండా ఇలాంటివి చేయకూడదు అంటూ హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఆమెను పోలీసులు వదిలేశారు. అయితే జులియానా మాత్రం పర్మిషన్ అడిగినా ఇవ్వలేదని.. అందుకే తాను ఇలా చేశాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఏది ఏమైనా బిగ్ బాస్ లో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు సడన్గా ఎన్నికల సమయంలో విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈమె చేసిన ఈ ప్రచారం విజయ్ అభిమానులకు పూర్తిస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×