Technical Glitch on IndiGo Flight: ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించింది. తాజాగా హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణీకులు ప్రాణాలతో ఉంటామా? లేదా? అనే స్థాయికి తీసుకెళ్లింది. బయల్దేరాల్సిన సమయం కంటే నాలుగు గంటలు ఆసల్యం కావడంతో పాటు ప్రయాణం అంతటా ఏసీ ఫెయిల్ కావడంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు. పిల్లలు ఉక్కపోత తట్టుకోలేక గుక్కపట్టి ఏచ్చారు. సంస్థ తీరుపై ప్రయాణీకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా 6E 6684 ఇండిగో ఫ్లైట్ సాయంత్రం 6:35కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొచ్చికి బయల్దేరాల్సి ఉంది. కానీ, ఏకంగా నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి 10:05కి బయల్దేరింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత అసలు కథ మొదలయ్యింది. ఏసీ పని చేయడం ఆగిపోయింది. టేకాఫ్ అయిన ఐదు, పది నిమిషాల తర్వాత ఈ సమస్య మొదలయ్యింది. ప్రయాణం అంతా ఏసీ లేకుండానే గడపాల్సి వచ్చింది. లోపల వేడి ఎక్కువై, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పబ్బారు. ఉక్కపోత తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చారు. పిల్లలు ఏడవడంతో, ఎయిర్ హోస్టెస్‌లు చేతితో గాలి ఊపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో ఈ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో ప్రయాణికులు గాలి లేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపించాయి.
సాధారణంగా విమానాల్లో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ తప్పనిసరిగా ఉంటుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే ఏసీ అత్యంత కీలకం. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఏసీ సమస్య తలెత్తుతుంది. కొన్ని సాంకేతిక లోపాలు లేదా అనుకోని పరిస్థితుల వల్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు విమాన ప్రయాణం సాధారణంగా దాదాపు 1 గంట 40 నిమిషాలు పడుతుంది. ఈ రూట్ లో పలు ఎయిర్ లైన్స్ సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లాంటి సంస్థలు ఈ మార్గంలో రెగ్యులర్‌గా ఫ్లైట్లు నడుపుతున్నాయి.
ఈ ఘటనపై అధికారికంగా ఇండిగో ఎయిర్ లైన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద చర్చగా మారింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం విషయంలో ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని నెటిజన్లు అంటున్నారు. ప్రయాణీకులు సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఆలస్యం, ఆపై ఏసీ పని చేయకపోవడంపై మండిపడుతున్నారు.
Read Alos: రోల్స్ రాయ్స్ లో టీ అమ్మకం.. లాభం రాకపోయినా నెట్టింట సూపర్ హిట్!