E-Paper
Advertisement

ఘనంగా బొమ్మరిల్లు కిరణ్మయి కూతురి పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!

ఘనంగా బొమ్మరిల్లు కిరణ్మయి కూతురి పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!
Advertisement

Film industry:తెలుగు బుల్లితెర ప్రేక్షకులక సురిచతురలైన నటి మీనా వాసు ఇంట్లో కళ్యాణ వైభోగం జరిగింది. ఆమె గారాల పట్టి వివాహ వేడుక ఇటీవల అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఏప్రిల్ 10న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న పెళ్లికూతురిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ అభిమాన నటి ఇంట జరిగిన ఈ శుభకార్యానికి బుల్లితెర సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సందడిగా సాగిన పెళ్లి వేడుకలు:

మీనా వాసు తన కూతురి పెళ్లిని అత్యంత ఆత్మీయంగా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో మీనా వాసు తన కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా గడిపిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లి కూతురు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా, మీనా వాసు తన కూతురిని చూసి మురిసిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకలో తీసిన ప్రతి ఫోటో ఒక అందమైన జ్ఞాపకంలా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం:

Advertisement

నటిగా మీనా వాసు ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, దాదాపు 30 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్నారు. ఐదుకు పైగా సూపర్ హిట్ ధారావాహికలు, వందకు పైగా చిత్రాల్లో ఆమె వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ‘బొమ్మరిల్లు’ సీరియల్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక తన సుదీర్ఘ సినీ, టీవీ ప్రయాణం పట్ల ఆమె ఎంతో సంతృప్తిగా ఉన్నానని, ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణే తన అసలైన బలం అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

బుల్లితెరపై చెరగని ముద్ర:

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించినా, బుల్లితెరపైనే ఆమెకు విశేషమైన గుర్తింపు లభించింది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే మీనా వాసు, ఇంటింటికీ పరిచయమున్న ముఖంగా మారిపోయారు. సీరియల్స్ అంటే ఇష్టపడే మహిళా ప్రేక్షకులకు మీనా వాసు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న బొమ్మరిల్లు సీరియల్ లో కిరణ్మయి పాత్రతో ఆకట్టుకుంటుంది. ఇకపోతే తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈమె, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ తన వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. అందుకే ఇప్పుడు ఆమె కూతురి పెళ్లి వేడుక ఫోటోలు చూసి ఫ్యాన్స్ అంతా మన ఇంటి వేడుకలాగే భావిస్తున్నారు.

కొత్త జంటకు శుభాకాంక్షలు:

Advertisement

ఏది ఏమైనా, మీనా వాసు తన వృత్తిపరమైన జీవితంలో ఎంత విజయవంతమయ్యారో, వ్యక్తిగత జీవితంలోనూ అంతే సంతోషంగా ఉన్నారు. కూతురిని ఒక ఇంటిదాన్ని చేసిన తృప్తి ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనం కూడా కోరుకుందాం. అటు సీరియల్స్‌తో మనల్ని అలరిస్తూనే, ఇటు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్న మీనా వాసు మరిన్ని మంచి పాత్రలతో మన ముందుకు రావాలని ఆశిద్దాం.

ALSO READ:బెంట్లీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక చోప్రా.. మొత్తం ఆస్తి విలువ తెలిస్తే షాక్!

Related News

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Big Stories

Advertisement
×