E-Paper
Advertisement

ట్రయంఫ్ ట్రాకర్ 400 vs స్పీడ్ 400, వీటిలో ఏది బెస్ట్ బైక్ అంటే?

ట్రయంఫ్ ట్రాకర్ 400 vs స్పీడ్ 400, వీటిలో ఏది బెస్ట్ బైక్ అంటే?
Advertisement

Tracker 400 vs Speed 400 Comparison: ట్రయంఫ్ మోటార్‌ సైకిల్స్ 400సీసీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి కొత్తగా ట్రాకర్ 400ను విడుదల చేసింది. ఈ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన స్పీడ్ 400కి.. ఇదో  స్పోర్టీ, స్టైలిష్ ప్రత్యామ్నాయంగా నిలువనుంది. ఈ రెండు బైక్‌లు ఒకే ప్లాట్‌ ఫారమ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, డిజైన్, రైడింగ్ పొజిషన్, పనితీరు లాంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. ఇంతకీ  ఈ రెండు బైక్స్ మధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు బైక్స్ డిజైన్ గురించి..

డిజైన్ విషయానికి వస్తే, ట్రాకర్ 400 మరింత అగ్రెసివ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇది ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ బైక్‌ల నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ముందు భాగంలో చిన్న కౌల్, షార్ప్ గా ఉండే ఫ్యూయల్ ట్యాంక్, పెద్ద సైడ్ ప్యానెల్స్ ఆకట్టుకుంటుంది.  వెనుక భాగంలో ఫ్లాట్ సీటు, స్టైలిష్ టెయిల్ సెక్షన్ ఉండటం వల్ల బైక్‌ కు స్పోర్టీ ఫీలింగ్ వస్తుంది. అటు, స్పీడ్ 400 క్లాసిక్, మోడ్రన్ మిక్స్ స్టైల్‌ తో ఉంటుంది. రౌండ్ ట్యాంక్, సింపుల్ డిజైన్, స్టెప్డ్ సీటు లాంటి అంశాలు దీన్ని సాధారణ రోడ్‌ స్టర్‌ గా చూపిస్తాయి.

Advertisement

రైడింగ్ పొజిషన్‌లో కూడా రెండు బైక్‌ల మధ్య తేడా ఉంది. ట్రాకర్ 400లో వెడల్పాటి, ఫ్లాట్ హ్యాండిల్‌ బార్ ఉంటుంది. దీనివల్ల రైడర్ కొద్దిగా ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది, ఇది స్పోర్టీ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మలుపుల్లో బైక్‌పై మంచి కంట్రోల్ కూడా లభిస్తుంది. స్పీడ్ 400లో మాత్రం సౌకర్యవంతమైన, రిలాక్స్‌ డ్ రైడింగ్ పొజిషన్ ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది.

ఇంజిన్ విషయానికి వస్తే..

ఇంజిన్ విషయానికి వస్తే, ట్రాకర్ 400 కొద్దిగా ఎక్కువ పవర్ ఇస్తుంది. ఇందులో 349సీసీ ఇంజిన్ ఉండి సుమారు 39.5 బిహెచ్‌పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది స్పీడ్ 400 కంటే కొద్దిగా ఎక్కువ. ఈ అదనపు పవర్ వల్ల ట్రాకర్ మరింత యాక్టివ్ గా ఉంటుంది. స్పీడ్ 400 కూడా మంచి పనితీరు ఇస్తుంది. కానీ, అది సాఫ్ట్, స్మూత్ రైడింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

వీల్స్, టైర్ల విషయంలో కూడా తేడా ఉంటుంది. రెండు బైక్‌లలో 17 అంగుళాల వీల్‌లు ఉన్నా, ట్రాకర్ 400లో డ్యూయల్ పర్పస్ టైర్లు ఉంటాయి. ఇవి కొంచెం ఆఫ్ రోడ్, మిక్స్‌ డ్ రోడ్లపై ప్రయాణించడానికి పనికొస్తాయి. స్పీడ్ 400లో మాత్రం రోడ్‌ కు అనుకూలమైన టైర్లు ఉంటాయి. ఇవి హైవే, సిటీ రైడింగ్‌ కు బాగా సరిపోతాయి.

ట్రాకర్ 400లో టెయిల్ సెక్షన్ కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఫ్లాట్‌గా ఉండే డిజైన్‌తో పాటు డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్‌ ను కలిగి ఉంటుంది. దీనివల్ల బైక్ సౌండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ 400లో సాధారణ ఎగ్జాస్ట్ సెటప్ ఉంటుంది.

ధర ఎలా ఉందంటే?

ట్రాకర్ 400 కొంచెం ఎక్కువ ఖరీదుగా ఉంటుంది. సుమారు రూ. 2.46 లక్షలకు అందుబాటులో ఉంది. స్పీడ్ 400 ధర సుమారు రూ. 2.32 లక్షలుగా ఉంటుంది.  స్టైల్, స్పోర్టీ ఫీలింగ్ కోరుకునే వారికి ట్రాకర్ 400 సరైన ఎంపిక కాగా, సింపుల్, కంఫర్టబుల్ రైడింగ్ కోసం స్పీడ్ 400 మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

Read Also: బజాజ్ నుంచి స్టైలిష్ అప్‌డేట్, ‘బ్లాక్ గోల్డ్’ కలర్‌ తో పల్సర్ 150!

Related News

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

Big Stories

Advertisement
×