E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ లో బ్రహ్మముడి కళ్యాణ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్?

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ లో బ్రహ్మముడి కళ్యాణ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్?
Advertisement

Gundeninda Gudigantalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మధ్యతరగతి కుటుంబంలోని పరిస్థితులను ఎదుర్కొనే ఒక జంట కుటుంబ గౌరవాన్ని ఎలా పెంపొందిస్తుంది అన్నది ఈ సీరియల్ అసలు స్టోరీ.. ఇందులో హీరో హీరోయిన్లుగా బాలు మీనా నటించారు.. వీరి నటన సీరియల్ కి హైలైట్ గా నిలవడంతో ఎక్కువ మంది జనాలు వీరికోసమే సీరియల్ ని చూస్తున్నారు.. ప్రస్తుతం ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సీరియల్లోకి సీరియల్ నటుడు కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. దొంగలకు ఫ్రెండ్ గా టీవీ నటుడి పాత్రలో నటిస్తున్నారు. ఆ దొంగను పట్టుకోవడం కోసం బాలు, మీనా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కళ్యాణ్ ఈ సీరియల్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..? ఆయన సీరియల్స్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కళ్యాణ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

గుండెనిండా గుడిగంటలు సీరియల్ రోజుకో ట్విస్ట్ తో జనాలను ఆకట్టుకుంటుంది.. డిఫరెంట్ స్టోరితో వస్తున్న ఈ సీరియల్ రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ మధ్య ఇందులోకి కొత్త క్యారక్టర్ లు ఎంట్రీ ఇస్తున్నాయి. నిన్నటికీమొన్న మీనాకు పోటీగా చింతామణి అనే క్యారక్టర్ ను దింపారు. ఇప్పుడు మరో కొత్త క్యారక్టర్ ను దించారు.. టీవీ సీరియల్ నటుడు కిరణ్ కాంత్ ఇందులోకి స్పెషల్ క్యారక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మముడి సీరియల్ నటుడు కళ్యాణ్ గా ఎంట్రీ ఇచ్చాడు.. అతని నుంచి నిజం చెప్పించాలని మీనా అతనికి దగ్గర అవుతుంది.. ఈ క్యారక్టర్ లో నటించినందుకు ఒక్కరోజుకు 35 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన అతను నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు..

Advertisement

Also Read:HBD Ntr : ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..? బాలనటుడు టు డ్రాగన్.

కిరణ్ కాంత్ సీరియల్స్ విషయానికొస్తే..

మనోజ్ నుంచి డబ్బులు కొట్టేసి పారిపోయిన వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్న బాలుకి…ఓ సీరియల్ నటుడు ఇంటికి వచ్చేవాడని తెలుసుకున్న బాలు ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. ఆ నటుడే కిరణ్ కాంత్.. బ్రహ్మముడి కళ్యాణ్ పాత్రలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఈ నటుడు రియల్ లైఫ్ విషయానికొస్తే.. కిరణ్ కాంత్ విజయవాడకు చెందిన వ్యక్తి.. అక్కడే తన గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసి నటనపై ఆసక్తి ఉండడంతో సీరియల్స్ వైపు అడుగులు వేశాడు. పలు ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత తనకు అవకాశం దక్కింది. పౌర్ణమి, అమ్మ ,ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గుప్పెడంతమనసు, బ్రహ్మముడి సీరియల్స్ లలో నటించాడు. వీటితో పాటుగా మరికొన్ని సీరియల్స్ లలో నటిస్తున్నాడు. త్వరలోనే వాటి గురించి తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈయన రియల్ లైఫ్ లో పెళ్లయిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిరణ్ కాంత్. వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు.

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×