E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసిన రాజు 

Brahmamudi Serial Today Episode April 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: కేక్‌ కటింగ్‌ అయిపోయాక రాజ్‌ వెళ్లి కేక్ పక్కకు తీసుకెళ్తుంటే.. ఐశ్వర్య ఆపి అసలు మీరు చెప్పింది ఏంటి..? చేస్తుంది ఏంటి..? అని అడగ్గానే.. ఈ మిషన్‌ సడెన్‌గా పని చేయడం ఆపేసింది అని రాజు చెప్పగానే. ఐశ్వర్య కోపంగా నాకు కావాల్సింది సాకులు కాదు.. రిజల్ట్స్‌ ఇప్పుడు మీ వల్ల నా ప్లాన్‌ అంతా వేస్ట్ అయింది. మీ వల్ల కాకపోతే తప్పకుని ఉండాల్సింది. అనవసరంగా ప్లాన్‌ మొత్తం ఫెయిల్‌ చేశారు. అంటూ తిడుతుంటే రాజు ఇంక ఆపుతావా..? మేము ఏం కావాలని చేయలేదు. అయినా ఇంకా సంతకం పెట్టలేదు కదా..? ఇందు సంతకం పెట్టదు.. మేము అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం.. నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి వెల్లిపోతాడు. భ్రమరాంబ లాయర్‌ను ఫైల్‌ పట్టుకుని రా అని చెప్పగానే.. లాయర్‌ ఫైల్‌ తీసుకెళ్తాడు. ఇక్కడ సంతకం చేయండి మేడం అని చెప్పగానే.. భ్రమరాంబ మా ఇందు చదువుకోలేదండి సంతకం ఎలా పెడుతుంది..? అని చెప్పగానే..

అక్కడ ఒక వ్యక్తి ఇన్ని కోట్లకు వారసురాలు అయ్యుండి సంతకం పెట్టేంత చదువు కూడా లేదా..? అదేంటి అని అడగ్గానే.. భూషణ్‌ అంటే చిన్నప్పటి నుంచి తనును చదివించడానికి చాలా ట్రై చేశాం.. తనకు చదువు అబ్బలేదు.. అనగానే.. రేఖ కూడా అయినా కోట్లు ఉన్నప్పుడు చదువుతో పనేముంది మీరెంతో చదువుకున్నవాళ్లే ఫ్యూచర్‌లో తన కింద పని చేస్తారు అని చెప్పగానే.. భ్రమరాంబ బాగా చెప్పావు రేఖ ఏంటి లాయరు గారు సంతకం పెట్టకపోతే ఏంటి వేలి ముద్ర వేయోచ్చు కదా అనగానే.. వేయోచ్చు మేడం అని చెప్పగానే.. అయితే వెళ్లి ఇంక్‌ ప్యాడ్‌ తీసుకురండి అని చెప్పగానే.. లాయరు వెళ్లి ఇంక్‌ ప్యాడ్‌ తీసుకొచ్చి ఇస్తాడు. రేఖ దగ్గరుండి ఇందు చేత వేలి ముద్ర వేయిస్తుంటే.. అప్పుడే లక్కీ తీసుకొచ్చిన మిషన్‌ ఆన్‌ అవుతుంది. అందులోంచి స్మోక్‌ వస్తుంది. ఆ స్మోక్‌కు అక్కడున్న వాళ్లందరూ కళ్లు తిరిగి పడిపోతారు. రాజు, ఇందును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే బయటి నుంచి వచ్చిన ఐశ్వర్య చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది.

Advertisement

బయటకు వెళ్లిన ఇందును కారెక్కమని రాజు చెప్పగానే.. అయ్యో ఆగండి మర్చిపోయాను.. అంటూ చెట్టు దగ్గరకు వెళ్లి ఒక బ్యాగ్‌ తీసుకుని వచ్చి బ్యాగ్‌ మర్చిపోయాను ఇక వెళ్దామా..? అంటుంది. ఇందు మాటలకు రాజు, లక్కీ షాక్‌ అవుతారు. మావ ఈ అమ్మాయిని మనం కిడ్నాప్‌ చేస్తున్నామా..? లేక మనల్నే ఈ అమ్మాయి కిడ్నాప్‌ చేస్తుందా..? అని అడగ్గానే.. ఓరేయ్‌ మనం వదిలిన స్మోక్‌ దెబ్బకు మతి పోయిందేమో ముందు మనతో పాటు రానివ్వు అని చెప్తుంటే.. ఇందు హలో ఏంటి అలా చూస్తున్నారు. మళ్లీ అందరూ వస్తారు. వెళ్దాం పదండి.. రండి త్వరగా కారు ఎక్కండి.. వెళ్దాం పదండి.. కారు త్వరగా స్టార్ట్‌ చేయండి నాకు చాల సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఫస్ట్‌టైం ఇలాంటి అడ్వెంచర్‌ చేయడం.. నాకు ఈరోజు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు ఉంది అని చెప్తుంటే..

లక్కీ షాకింగ్‌గా మేడం ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా..? అని అడగ్గానే.. ఇందు కిడ్నాపే కదా చేస్తున్నారు.. చూడ్డానికి మీరు వెధవల్లా ఉన్నా కిడ్నాప్‌ బాగానే చేస్తున్నారు అంటూ ఇందు అనగానే.. రాజు కోపంగా మమ్మల్ని తిట్టడం పక్కన పెట్టు అక్కడ స్మోక్‌ వల్ల అందరూ పడిపోయారు కదా..? మరి నువ్వెందుకు పడిపోలేదు.. అని అడగ్గానే.. ఓ అదా..? స్మోక్‌ స్టార్ట్‌ అవ్వగానే.. నా ముక్కికి చున్ని అడ్డుపెట్టుకున్నాను అని చెప్పగానే.. చున్నీ ఓకే కర్చీప్‌తో ఎప్పుడైనా ట్రై చేశారా..? అంటూ మత్తుమందు ఇచ్చి ఇందు మైకంలో పడిపోగానే అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు.

Advertisement

తర్వాత అందరికి మెలుకువ రావడంతో లేచి అందరూ ఇందు కోసం వెతుకుతుంటారు. ఐశ్వర్య వచ్చి ఎవరో ఇందును కిడ్నాప్‌ చేశారు అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. భ్రమరాంబ బాధపడుతుంది. రేఖ కోపంగా భూషణ్‌ను పోలీసులకు ఫోన్‌ చేయమని చెప్తుంది. మరోవైపు ఇందును తీసుకెళ్లి ఒక పాడుబడిన ఇంట్లో బంధిస్తారు రాజు, లక్కీ. తర్వాత ఐశ్వర్యకు ఫోన్‌ చేసి ఎంత డబ్బు అడగాలని చెప్పగానే.. ఐశ్వర్య ఇరవై లక్షలు అడగాలని చెప్తుంది. రాజు కోటి రూపాయలు అడగాలని చెప్తాడు. దీంతో ఐశ్వర్య, లక్కీ షాక్‌ అవుతారు.

తర్వాత పోలీసులు దుగ్గిరాల ఇంటికి వచ్చి ఇందు కిడ్నాప్‌ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. మీ ఇంట్లో వాళ్లే ఎవరో తెలిసే ఈ కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. వీడేంటి డైరెక్టుగా పాయింట్‌కు వచ్చేశాడు అని భయపడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×