Gaja Lakshmi Yoga: గ్రహస్థితులు కారణంగా ఇన్ని రోజులు అష్టకష్టాలు పడిన ఐదు రాశుల వారికి అదృష్టయోగం పట్టనుంది. మిథున రాశిలోకి వెళ్తున్న శుక్రుడు ఆ ఐదు రాశుల్లో జన్మించిన వారి జాతకంలో గజలక్ష్మీ యోగాన్ని ఇవ్వనున్నాడు. దీంతో వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇంతకీ ఆ ఐదు రాశులు ఏవీ వారికి పట్టబోయే రాజయోగం ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
మేష రాశి: శుక్రుడు మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడంతో మొదటగా మేష రాశి జాతకులకు గజలక్ష్మీ యోగం పట్టనుంది. దీంతో ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్ మరియు క్రియేటివ్ ఆలోచనలలో బలం పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వీరికి ఇన్ని రోజులు ఎవరైతే సాయం చేయడానికి వెనకడుగు వేశారో వాళ్ల నుంచే సాయం అందుతుంది. కొత్త అవకాశాలు ఈ రాశి వారికి ఎదురు వస్తాయి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. అలాగే శుభవార్తలు అందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి: శుక్రుడు రెండవ ఇంట్లో సంచారం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త బట్టలు, అభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంగీతం మరియు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ఆయా రంగాలలో ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. డబ్బుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీ సంపద పెరుగుతుంది. మాతృదేవతారాధన ద్వారా మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు.
తులా రాశి: శుక్రుడి సంచారంతో తులా రాశి వారికి విదేశీ అవకాశాలు మెరుగవుతాయి. శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. యాత్రలు, చదువు లేదా వృత్తి విషయంలో సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రద్దగా పని చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది.
వృశ్చిక రాశి: ఎనిమిదవ ఇంట శుక్ర సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మీరు ఎదుర్కోన్న కష్టాల నుంచి గట్టెక్కి ఊపిరి పీల్చుకుంటారు. ప్రేమ సంబంధాల్లో అనుబంధం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. సంపద విషయంలో అనూహ్యమైన లాభాలు ఆశించవచ్చు.
కుంభ రాశి: ఐదవ ఇంట్లో శుక్రుడి సంచారంతో కుంభ రాశి వారికి విద్య, సృజనాత్మకత మరియు ప్రేమలో మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులకు ఇది విజయదాయకమైన సమయం. కళలు, సంగీతం, సాహిత్యం రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. జీతం పెరుగుదల పదోన్నతికి అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలు చేస్తారు. ధైర్యంతో మీరు విజయాల వైపు దూసుకెళ్తారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: కాలికి నల్లదారం కడుతున్నారా..? అయితే ఆ నాలుగు రాశుల వాళ్ళు జాగ్రత్త