BigTV English

Brahmamudi Serial Today November 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   రాజ్‌ డిజైన్స్‌ మెచ్చుకున్న జగదీష్‌ – సైలెంట్‌ అయిపోయిన కావ్య –  పందెంలో గెలిచానని రాజ్‌ ఆనందం  

Brahmamudi Serial Today November 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్:   రాజ్‌ డిజైన్స్‌ మెచ్చుకున్న జగదీష్‌ – సైలెంట్‌ అయిపోయిన కావ్య –  పందెంలో గెలిచానని రాజ్‌ ఆనందం  

Brahmamudi serial today Episode:  ఆఫీసుకు వెళ్తున్న రాజ్‌ ఇంట్లో వాళ్లను దీవించమని అడుగుతాడు. పందెంలో  తానే గెలవాలని అందరూ కోరుకోమని చెప్తాడు. అయితే అపర్ణ  దగ్గరకు వెళ్లిన రాజ్‌ను పిల్లా పాపలతో చల్లగా ఉండు న్నానా అని ఆశీర్వదిస్తుంది. దీంతో రాజ్‌ కోపంగా  నీ దీవెనలు ప్రిజ్ లో పెట్టు అని చెప్తాడు. ఇక్కడ ఇంతకు మించి రావు అక్కడేమైనా ట్రై చేయ్‌ అని ఇందిరాదేవిని చూపిస్తుంది. నాన్నమ్మ బ్లెస్‌ మీ అని వెళ్లగానే సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తుంది దీంత రాజ్‌ మరింత ఇరిటేటింగ్‌ గా అసలు నేను వెళ్తున్న పనేంటి మీరు దీవిస్తున్న దీవేనలు ఏంటి..? అయినా  నేను గెలుస్తున్నాను. కళావతి ఓడిపోతుంది. ఇంకెప్పటికీ ఇంటికి రాదు. ఆఫీసులో అడుగుపెట్టదు అంటాడు.


ఏరా కడుపు అన్నం తినే వారెవరైనా మొగెడు పెళ్లాం విడిపోవాలని కోరుకుంటారా..? అంటుంది ఇందిరాదేవి. దీంతో స్వప్న మా అత్త అన్నం తినదా..? బామ్మ.. అని అడుగుతుంది. స్వప్న మాటలకు రుద్రాణి కోపంగా  జస్ట్‌ షడప్‌ నన్నెందుకు లాగుతావు అంటుంది. రాహుల్ కూడా  చాలా ఓవర్‌ గా మాట్లాడుతున్నావు స్వప్న అంటాడు. ఓ మీరు తల్లీ కొడుకులు ఏదైనా షేర్‌ చేసుకుంటారు కదా..? మర్చిపోయాను సారీ రాహుల్‌ అంటుంది స్వప్న. ఇంతలో అక్కడికి సుభాష్‌ వస్తాడు.  డాడీ మీరు పుత్రోత్సాహంతో పొంగిపోయే తరుణం ఆసన్నమైంది అంటూ రాజ్‌ ఎదురువెళ్తాడు.

దీంతో సుభాష్‌.. నిజమా నాన్నా.. ఏ తండ్రికైనా కొడుకు కాపురం చేసుకుంటూ మనవడినో మనవరాళినో ఇస్తే సంతోషంగా ఉంటుంది అని చెప్పగానే రాజ్‌ అసంతృప్తిగా డాడీ మీరు జనరేషన్‌ పంచడం గురించి మాట్లాడుతున్నారు. నేను పందెంలో గెలవడం గురించి మాట్లాడుతున్నాను. నన్ను దీవించండి అని అడుగుతాడు. దీంతో ఇద్దరికీ ఆల్‌ ది బెస్ట్ అని చెప్తాడు.  దీంతో రాజ్‌ ఏంటి డాడీ ఇది అని అడుగుతాడు. అరేయ్‌ రాజ్‌ నేను తండ్రిని కావ్యకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ని అని చెప్తాడు.


అయితే నాకు తాతయ్యే కరెక్టు అంటూ సీతారామయ్య దగ్గరకు వెళ్లితే సీతారామయ్య కూడా  పుత్ర పౌత్రాభిరస్తు అంటూ దీవిస్తాడు.  దీంతో రాజ్ ఇరిటేటింగ్‌ గా పందెంలో నేనే గెలుస్తున్నాను. ఆ కలావతి ఇంటికి రాదు. ఎప్పటికీ ఆఫీసుకు రాదు అని చెప్పగానే రుద్రాణి వచ్చి రాజ్ కు ఆల్‌ ది బెస్ట్ చెప్తుంది. ఇంతలో స్వప్న తుమ్ముతుంది. నా తుమ్ము మా కావ్యకు కలిసి వస్తుందని ఎప్పుడు చెప్పేది. అంటుంది. ఏదిఏమైనా ఇవాళ పందెంలో నేనే గెలుస్తున్నాను. నా టీమ్‌కు ఇంట్లోనే గ్రాండ్‌ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు.

ఆటో డ్రైవర్‌ కావ్యను ఆఫీసుకు లేటుగా తీసుకెళ్లాలని స్లోగా పోతుంటాడు. కావ్య ఎందుకు ఇంత మెల్లగా వెళ్తున్నావు పాస్ట్‌ గా వెళ్లు అని చెప్తుంది. దీంతో డ్రైవర్‌ అతి వేగం ప్రమాదకరం మేడం. అంటూ ఇంకో రూట్లో వెళ్తాడు. ఇలా ఎలా వెళ్తున్నావు అని కావ్య అడిగితే అక్కడ రోడ్డు వర్క్‌ జరగుతుందట మేడం బోర్డు పెట్టారుగా మీరు చూడలేదా..? అని చెప్తాడు. స్పీడుగా తీసుకెళ్లే ఆ రాజ్‌ సార్‌ చంపేస్తారు. తీసుకెళ్లకపోతే ఈ మేడం చంపేసేలా ఉందని రాజ్‌కు మెసేజ్‌ పెట్టి స్పీడుగా వెళ్తాడు.

ఆఫీసుకు వచ్చిన  జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌, రాజ్‌ ఇద్దరూ కావ్య కోసం వెయిట్‌ చేస్తుంటారు.  మన మీటింగ్‌ పది గంటలకు అనుకున్నం కదా..? కావ్య గారు ఇంకా రాలేందేంటి…? అని జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ అడుగుతాడు. దీంతో రాజ్‌ తన తరుపున నేను సారీ చెప్తున్నాను సార్‌ అంటూ బిల్డప్‌ కొడతాడు.  ఇట్స్‌ ఓకే మేబీ ఈ ట్రాఫిక్‌ జామ్‌ లో లేట్‌ అయిందనుకంటాను. వెయిట్‌ చేద్దాం అంటాడు జగదీష్‌.  అవకాశం దొరికిందని అల్లుకుపోతున్నాడు గురుడు. ఈనేమో ఈగోకు బ్రాండ్‌ అంబాసిడర్‌. అని మనసులో అనుకుంటుంది.

రాజ్‌ వినబడింది అని మనసులో అనుకుని..  శృతి మీ మేడంకు ఫోన్‌ చేసి ఎక్కడుందో కనుక్కో.. అని చెప్తాడు. సరేనని శృతి, కావ్యకు ఫోన్‌ చేస్తుంది. ఎక్కడున్నారు మేడం అని అడుగుతుంది. ఎక్కడున్నానో తెలియడం లేదు శృతి అని కావ్య చెప్పగానే ఎప్పుడో బయలుదేరాను అని చెప్పారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి మేడం. అని శృతి అడగ్గానే రోడ్డు వర్క్‌ జరగడంతో వేరే రూట్లో వస్తున్నాం అని చెప్తుంది. ఇంతలో ఆటోకు ఒక బైక్‌ వచ్చి తగులుతుంది. ఆటో డ్రైవర్‌, ఆ బైకర్‌ తో గొడవ పెట్టుకుంటాడు. కావ్య వెళ్లి ఇద్దరికి సర్ది చెప్పి బైక్‌ అతనికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వస్తారు.

కావ్య రావడం లేటవుతుందని అంత వరకు నేను వేసిన డిజైన్స్‌ చూడండి అని రాజ్‌, జగదీశ్‌ కు చెప్పడంతో సరేనని అంటాడు. కావ్య టేబుల్‌ మీద కొట్టేసిన డిజైన్స్‌ నే రాజ్‌ చూపిస్తుంటాడు. అవి చూసిన శృతి షాక్‌ అవుతుంది. ఇవి కావ్య మేడం వేసిన డిజైన్స్‌ కదా అనుకుంటుంది. ఇవి సార్‌ దగ్గరకు ఎలా వచ్చాయి అనుకుంటుంది. ఇంతలో అక్కడకు కావ్య వస్తుంది. రాజ్‌ చూపిస్తున్న డిజైన్స్‌ చూసి  షాక్‌ అవుతుంది. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోతుంది. మేడం అవి మీరు వేసిన డిజైన్స్‌ కదా..? అని అడుగుతుంది.

అవునని ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దని క్లయింట్ ముందు కంపెనీ పరువు పోతుందని చెప్తుంది కావ్య.  ఇంతలో జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌, రాజ్‌ వేసిన డిజైన్స్‌ చాలా బాగున్నాయని మెచ్చుకుంటాడు. కావ్యను చూసి నువ్వే వేసిన డిజైన్స్‌ చూపించమని అడుగుతాడు. నా డిజైన్స్‌ ఇంకా పూర్తి కాలేదని కావ్య చెప్తుంది. ఆయన వేసిన డిజైన్స్‌ మీకు నచ్చితే అవే ఫైనల్ చేయండని కావ్య చెప్పగానే జగదీష్‌ అవే డిజైన్స్‌ ఫైనల్ చేస్తాడు. రాజ్ హ్యాపీగా ఫీలవుతాడు. రాజ్‌కు కంగ్రాచ్యులేషన్‌ చెప్తుంది కావ్య.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×