intinti Ramayanam Today Episode November 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ పల్లవిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. పల్లవి కోసం ప్రూట్ సలాడ్ ను చేసి తీసుకొని వస్తాడు. అంతలోకే బామ్మ అక్కడికి వచ్చి భర్త ప్రేమను వద్దని అనకూడదు అని అంటుంది. దాంతో పల్లవి తింటుంది. ఇక భరత్ అవని కలిసి వెళ్లడం చూసిన చక్రధర్ వాళ్ళను ఫాలో చేస్తూ వెళ్తాడు.. హాస్పిటల్ ని చూడగానే చక్రధర్ ఇది మీనాక్షి ఉండే హాస్పిటల్ కదా అనేసి వెనక్కి వెళ్ళిపోతుంటాడు. మీనాక్షి పిల్లల గురించి అసలు నిజం తెలుసుకున్న చక్రధర్.. ఇంట్లోకి అవని వస్తుంది. అప్పుడే బామ్మ వెళ్లి ఎక్కడకు వెళ్ళావు? ఇంత పొద్దున్నే ఎక్కడకు వెళ్ళావు అని అడగ్గానే, కమల్ కూడా నువ్వు లేవని ఆరాద్యను స్కూల్ కు తీసుకెళ్ళలేదు అని కమల్ అనగానే పార్వతి వచ్చి ఎక్కడకు వెళ్ళావు అవని ఒక మాట చెప్పి వెళ్తే బెటర్ కదా అని అంటుంది. అప్పుడే అక్కడకు అక్షయ్ అక్కడకు వస్తాడు. అసలు నిజం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అని అక్షయ్ అంటాడు. నువ్వు ఎలాగో నిజం చెప్పవు.. నేనే చెప్తాను అని అక్షయ్ అంటాడు. మనం పోలీసులకు పట్టించిన ఆ భరత్ ను విడిపించింది అని అక్షయ్ అంటాడు. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ కు తెలియకుండా ఉంచాలని అనుకుంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి వినోద్, ప్రణవి, కమల్ అందరు కలిసి రాజేంద్ర ప్రసాద్ కు నిజం తెలియనివ్వొద్దు అని అనుకుంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడ వస్తాడు. అందరు మౌనంగా ఉండటంతో ఏమైందని అడుగుతారు. పల్లవి నోరు జారుతుంది. ఇక ఇంట్లో అందరు రాజేంద్ర ప్రసాద్ కోసం వెయిట్ చేస్తారు. అంతలోకే అతను ఇంట్లోకి వస్తాడు. అందరు ఒకే చోట ఉండటంతో రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు.. ఏమైంది అని అందరూ అనుకుంటారు. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఎందుకు అందరూ హాల్లోనే ఉన్నారు ఏం జరిగింది? ఏం చేశారు అని అడుగుతాడు. మిమ్మల్ని చూసి రెండు రోజులు అయింది కదా మామయ్య అందుకే అందరూ ఇక్కడ ఉన్నాము మీకోసమే ఎదురు చూస్తున్నాము వెళ్లిన పని సక్సెస్ అయ్యిందా అని వినోద్ అడుగుతాడు. రాజేంద్రప్రసాద్ వెళ్లిన పని సక్సెస్ అయింది ఒకటికి పోతే రెండు వచ్చేసాయి అని చెప్తాడు. పావని గురించి నిజం చెప్పకూడదని అందరూ అనుకుంటారు పార్వతిని కాఫీ తీసుకురమ్మని రాజేంద్రప్రసాద్ అనగానే పార్వతి కాఫీ తీసుకొని వచ్చి వణుకుతూ ఇస్తుంది. బీపీ టాబ్లెట్ వేసుకోలేద పార్వతి అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. దానికి లేదండి మర్చిపోయాను వేసుకుంటాను అనేసి అనగానే సరే ఇంక వెళ్లి అందరూ పడుకోండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
రాజేంద్రప్రసాద్ వెళ్లిన తర్వాత అందరూ అవనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. నేల నాన్నకి విషయం తెలిస్తే ఎలా మేనేజ్ చేయాలో మా అందరికీ తెలుసు నువ్వేం కంగారు పడొద్దు వదినా అనేసి అంటారు. అది చూసి పల్లవి కుళ్ళుకుంటుంది. వాళ్ళందరూ నేను నెత్తిన పెట్టుకుంటున్నారు నీ గురించి నిజం తెలిస్తే మామయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేం అక్క అని వెళ్ళిపోతుంది. ఇంతగా మోసం చేస్తున్నాను మా అమ్మ తమ్ముడు గురించి నిజం చెప్తే ఈ టెన్షన్స్ నాకు ఉండేవి కాదు కదా అని అవని ఆలోచిస్తుంటుంది. ఇక పల్లవి నీ గురించి ఎలాగైనా నిజాన్ని మామయ్యకి చెప్తానని మనసులో అనుకుంటుంది.
ఇక రాత్రి అందరూ భోజనానికి డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. ఆరాధ్య ఎక్కడ అవని అని అవని అడుగుతాడు రాజేంద్రప్రసాద్. దానికి అవని అన్నం తినిపించి పడుకోపెట్టాను మావయ్య అనేసి అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. రాజేంద్రప్రసాద్ బిజినెస్ టూరు సక్సెస్ అయినందుకు ఎవరికీ ఏం కావాలో అడగండి మీ కోరికలను తీర్చేస్తాను అనేసి అంటాడు. ఇక వినోద్ నాకు మంచి పార్టీ ఇవ్వాలి మామయ్య అని అడుగుతాడు. ఇక అలాగే ప్రణవి కొత్త ఫోన్ కావాలని అడుగుతుంది. అలాగే కోమలి నాకు డైమండ్ రింగ్ కావాలని అడుగుతుంది. అందరికీ అన్ని కొనిస్తానని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక పార్వతి ముందు అవని అడగండి అనేసి అంటుంది. అవనిని నీకేం కావాలమ్మా అని అడుగుతాడు రాజేంద్రప్రసాద్. అప్పుడే పల్లవి పక్కకు వెళ్లి ఎవరో తెలియని వ్యక్తిలా కాల్ చేస్తుంది. రాజేంద్రప్రసాద్ మీరు ఎవరండీ? ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారని అడుగుతాడు? ఎవరైనా మీకు అనవసరం మీకు మీ కోడలు గురించి ఒక నిజం చెప్పాలని మీకు ఫోన్ చేశాను అని అంటుంది. నేర్పించిన భరత్ అనే ఆ వ్యక్తిని మీ కోడలు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిందని మీకు తెలుసా ఇది ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు అందరూ దాచి పెట్టారు అసలు విషయం ఏంటో మీ కోడల్ని అడిగి తెలుసుకోండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ కోపంతో అవని మీద చిందులు వేస్తాడు. కానీ అవని చెప్పినా ప్రసాద్ వినడు కోపంతో అవనీని గట్టిగా అరుస్తాడు. దానికి వినోద్ సపోర్ట్ చేస్తాడు. మీ అక్క ఇంటి కోసం ఎంతో కష్టపడుతుంది అలాంటి అవని అక్క తప్పు చేసిందని ఎలా అనుకుంటారు మామయ్య ఈరోజు మీ అమ్మాయితో విడాకులు తీసుకోకుండా సంతోషంగా ఉన్నందుకు కారణం అవని అక్క అని అనగానే కోమలి కూడా అవనీ వదిన చాలా మంచిది నాన్న నా భర్తతో నేను ఇలా కాపురం చేసుకోవడానికి అవని వదినే కారణం అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ అవని గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అక్షయ్ రాజేంద్రప్రసాద్ నీ భార్య తప్పు చేసినందుకు ఏం శిక్ష వేయాలో నువ్వే చెప్పు అనేసి అంటాడు. రేపటిలోగా ప్రణవిని ఏడిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అవనికి కండిషన్ పెడతాడు రాజేంద్రప్రసాద్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..