E-Paper
Advertisement

నాకు భజన చేయడం రాదు…నిహారిక పై చలాకి చంటి షాకింగ్ కామెంట్స్

నాకు భజన చేయడం రాదు…నిహారిక పై చలాకి చంటి షాకింగ్ కామెంట్స్
Advertisement

Chalaki Chanti చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా చలాకి చంటి(Chalaki Chanti) తన అద్భుతమైన స్కిట్లతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన బిగ్ బాస్ 6 అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత చంటి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చంటి తిరిగి ఇప్పుడిప్పుడే సినిమాలు బుల్లితెర కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు.

నిహారికపై చంటి కామెంట్స్…

ఈ నేపథ్యంలోనే చంటి నిహారిక కొణదెల నిర్మాతగా జీ తెలుగులో ఆట (Aata)డాన్స్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చలాకి చంటి కూడా పాల్గొన్నారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చంటి ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చలాకి చంటి నిహారిక (Niharika)గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిహారిక ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె నిర్మాతగా కొనసాగుతున్నారు.

నాగబాబు కూతురుగా పరిచయమయ్యారు..

Advertisement

నిహారికలో అప్పటికి ఇప్పటికీ ఏవైనా మార్పులు వచ్చాయా అంటూ ప్రశ్న ఎదురవడంతో చంటి మాట్లాడుతూ అప్పుడు ఆమె నాగబాబు కూతురిగా అందరికీ పరిచయమయ్యారు కానీ ఇప్పుడు ఒక నిర్మాతగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిహారిక ఇంత చిన్న వయసుకే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆమె చాలా చక్కగా అందరిని హ్యాండిల్ చేయగలుగుతుందని చంటి తెలిపారు.

భజన చేయటం నాకు చేతకాదు..

Advertisement

ఇక నిహారిక నటిగా అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీరు నిహారికకు నటిగా ఎన్ని మార్కులు వేస్తారు నిర్మాతగా 10 కి ఎన్ని మార్కులు వేస్తారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చంటి సమాధానం చెబుతూ నటన పరంగా నిహారిక గారికి పదికి పది మార్కులు వేస్తాను కానీ నిర్మాతగా మాత్రం 8 మార్కులు వేస్తానని తెలిపారు. నిర్మాతగా పదికి పది మార్కులు వేయొచ్చు కానీ నేను వేయను. నిహారిక నిర్మాతగా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అందుకే తాను ఎనిమిది మాత్రమే ఇచ్చాను. అందరిలాగా తాను భజన చేసే రకం కాదని ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడతానని చంటి తెలిపారు. చాలామంది అవకాశాల కోసం భజన కార్యక్రమాలు చేస్తుంటారు అలా భజన చేయటం నాకు రాదు, ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతానని చంటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ప్లీజ్ సాయం చేయండి.. రూ.16 కోట్లు కావాలి విజ్ఞప్తి చేస్తున్న బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×